Home   »  రాజకీయం   »   ED నోటీసులపై స్పందించిన MLC కవిత..!

ED నోటీసులపై స్పందించిన MLC కవిత..!

schedule mahesh

Delhi Liquor Scam Case: ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసులో MLC కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) ED మరోసారి నోటీసులు జారీ చేసింది. మద్యం కుంభకోణం కేసులో నేడు విచారణకు హాజరుకావాలని ED నోటీసుల్లో పేర్కొనడం జరిగింది.

mlc-kavitha-responded-to-ed-notices-!

ED నోటీసులపై కీలక నిర్ణయం తీసుకొన్న MLC Kavitha

Delhi Liquor Scam Case: ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసులో MLC కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) ED మరోసారి నోటీసులు జారీ చేసింది. మద్యం కుంభకోణం కేసులో నేడు విచారణకు హాజరుకావాలని ED నోటీసుల్లో పేర్కొనడం జరిగింది.

అయితే ED నోటీసులపై MLC కవిత కీలక నిర్ణయం తీసుకొంది. నేడు విచారణకు హాజరుకావాలని ED నోటీసుల్లో పేర్కొనగా, తాను ఈ విచారణకు హాజరుకాలేనని కవిత ఈడీకి లేఖ రాయడం జరిగింది. ఈడీ నోటీసులపై ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత పిటిషన్ పెండింగ్‌లో వుంది. ఇదే విషయాన్ని కవిత తన లేఖలో ఈడీ అధికారులకు గుర్తు చేసినట్టు తెలుస్తుంది. ఈ పిటిషన్ విషయంలో సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చేవరకు విచారణకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్టు లేఖలో తెలిపారు.

ED నోటీసులు, దర్యాప్తు పద్ధతిపై సుప్రీంను ఆశ్రయించిన కవిత

కాగా దేశంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో గతేడాది మార్చిలో కవితను ఈడీ మూడు రోజుల పాటు విచారించింది. అయితే తాజాగా ఈడీ మరోసారి కవితకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈడీ నోటీసులు, దర్యాప్తు పద్ధతిపై కవిత గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను మహిళగా ఈడీ కార్యాలయానికి పిలిపించి రాత్రి వరకు విచారించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.

ED కార్యాలయంలో మహిళలపై విచారణ CRC కి విరుద్ధమని కవిత మొదటి నుంచి వాదిస్తుంది. నళిని చిదంబరం మాదిరిగానే తనను కూడా ఇంట్లోనే విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా గతేడాది సెప్టెంబర్‌లో ED మళ్లీ నోటీసులు పంపడంతో కవిత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది.

జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని డిమాండ్‌ చేసిన కవిత

తనకు జారీ చేసిన ED నోటీసులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో స్పందించిన సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్ 20 వరకు కవితకు ఎలాంటి నోటీసులు జారీ చేయవద్దని ఈడీని ఆదేశించింది. అప్పటి నుండి కవిత కేసు విచారణకు రాకపోవడంతో తాజాగా ఈడీ మరోసారి నోటీసులు పంపింది. అయితే త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కవితకు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశం అయ్యింది.

Also Read: క్రికెట్ దిగ్గజానికి అందిన రాముడి ప్రాణ ప్ర‌తిష్ట‌ ఆహ్వానం