Home   »  రాజకీయం   »   Modi tour |మోడీ టూర్ రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం..

Modi tour |మోడీ టూర్ రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం..

schedule mounika

హైదరాబాద్: ఉత్తర తెలంగాణలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కాలేజీ మైదానంలో ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లను కిషన్ రెడ్డి పరిశీలించారు.

అక్టోబర్ 3న నిజామాబాద్ లో మోడీ టూర్(Modi tour)..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల జాగీర్ కాదని.. తండ్రి చాటు బిడ్డగా కేటీఆర్ షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. అక్టోబర్ 3న నిజామాబాద్ లో మోడీ పర్యటన రాష్ట్ర రాజకీయాలకు దిశా నిర్దేశం అవుతుందన్నారు. లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. 8 వందల మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టు వర్చువల్‌గా ప్రారంభిస్తారు.

అక్టోబర్ 1 నుంచి ఎన్నికల ప్రచారం..

ఖమ్మంలో కూడా పార్టీ బలపడిందన్నారు. మోడీ టూర్ (Modi tour) తర్వాత అమితా షా, నడ్డా పర్యటనలు ఉంటాయిన్నారు.. అక్టోబర్ 1 నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాం అని, హామీలపై కేటీఆర్ కు సమాధానం చెప్పే అవసరం మాకు లేదు అని దుయ్యబట్టారు. 17 సార్లు నోటిఫిసెషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వక పోవడం సిగ్గుచేటు అని అన్నారు..

బీఆర్ఎస్ నేతల ఎజెండాలో మేము పడబోం అని, ఎమ్మెల్సీలపై గవర్నర్ తమిళి సై నిర్ణయం సరైనదే. కవులు, కళాకారులు. విద్యావంతులు.. మేధావులకే ఎమ్మెల్సీ ఇవ్వాలి కానీ.. కేసీఆర్ కుటుంబానికి కొమ్ముకాస్తున్న వాళ్లు.. వారికి సేవ చేసే వారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా చేయాల్సిన అవసరం లేదన్నారు. అనర్హులకు పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటు. పసుపు బోర్డు ఏర్పాటు అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని కిషన్ రెడ్డి అన్నారు.