Home   »  రాజకీయం   »   కేంద్రానికి హెచ్చరికలు జారీ చేసిన సీఎం…ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం..!

కేంద్రానికి హెచ్చరికలు జారీ చేసిన సీఎం…ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం..!

schedule mahesh

పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) మరో సంచలన ప్రతిపాదనకు తెరలేపారు. గతంలో కేంద్ర ప్రభుత్వం వద్దన్నా వినకుండా కులగణన నిర్వహించి నివేదిక విడుదల చేసిన నితీశ్ కుమార్ ప్రభుత్వం ఆ మేరకు రిజర్వేషన్లను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది.

nitish kumar |the cm has issued a warning to the

ప్రత్యేక హోదా కోసం జేడీయూ ఎన్నో ఏండ్లుగా పోరాడుతుందన్న నితీష్ కుమార్

ఇటీవల CM నితీశ్ కుమార్ (Nitish Kumar) మీడియాతో మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభిస్తామని కేంద్రానికి హెచ్చరికలు జారీచేశారు. తమ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలంటే ప్రత్యేక హోదా తప్పకుండా కావాలన్నారు. దీనికి మద్దతివ్వనివారు బీహార్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నవారవుతారన్నారు. బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జేడీయూ (JDU) ఎన్నో ఏండ్లుగా పోరాడుతున్నదని అన్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతాం:నితీష్

కేంద్రం ప్రభుత్వం బీహార్‌కు త్వరగా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతాం. ఈ ఉద్యమంలో భాగంగా బీహార్ లోని ప్రతి మూలకు ప్రత్యేక హోదా డిమాండ్‌ని తీసుకెళతామని సీఎం పేర్కొన్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పలు సంక్షేమ పథకాలు అందించాలని నిర్ణయించుకున్నాం అన్నారు.

దీనికోసం బీహార్‌ లాంటి పేద రాష్ట్రానికి అనేక కోట్ల రూపాయాలు అవసరమవుతాయని, అందుకోసం కేంద్రం బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఆ డబ్బుతో రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకుంటామని Nitish Kumar తెలిపారు. ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆమోదిస్తారని భావిస్తున్నాం అన్నారు. ఆమోదం పొందిన తరువాత ఆయా వర్గాలకు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ కోటా అమలు చేసి వారి అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు.

కుల గణన ఆధారంగా రిజర్వేషన్ల పెంపు చేపట్టిన నితీష్ ప్రభుత్వం

కుల గణన ఆధారంగా నితీష్ ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపు చేపట్టింది. గవర్నర్ ఆమోదం కోసం వెళ్లిన రెండు బిల్లులు షెడ్యూల్డ్ కులాల(SC) కోటాను 16 నుండి 20 శాతానికి, షెడ్యూల్డ్ తెగలు(ST) 1 నుండి 2 శాతానికి, అత్యంత వెనుకబడిన కులాలు (EBC) 18 నుండి 25 శాతానికి, ఇతర వెనుకబడిన తరగతుల (OBC) 15 నుండి 18 శాతానికి రిజర్వేషన్ కోటాను పెంచడం జరిగింది.

ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో అణగారిన కులాల కోటాను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ రూపొందించిన బిల్లును బీహార్ శాసనసభ ఇటీవల ఆమోదించడం జరిగింది. అదేవిధంగా కులాల సర్వే ఆధారంగా మొత్తం రిజర్వేషన్లను 75 శాతానికి పెంచడం జరిగింది.

 బీహార్ రాష్ట్రానికి అద్భుతమైన గతం ఉందన్న Nitish Kumar

ఎన్నికలలో బిజెపిని మతం మరియు జాతీయవాదం వంటి వాటి నుండి ఎదుర్కోవడానికి, నితీష్ ప్రభుత్వంకు కుల గణన లాభం చేకూర్చే అంశం. ప్రత్యేక హోదా ప్రచారం రాష్ట్రానికి సంబంధించిన గుర్తింపు మరియు భావోద్వేగాలను రెచ్చగొట్టి నితీష్ ప్రభుత్వం లాభ పడేలా కనిపిస్తుంది. నితీష్ మీడియా తో మాట్లాడుతూ బీహార్ రాష్ట్రానికి అద్భుతమైన గతం ఉందని, అంతా ఇక్కడి నుంచే ప్రారంభమైందని, కానీ నేడు వెనుకబడి ఉందన్నారు.

ముఖ్యమంత్రి ఉద్యోగి యోజన (ముఖ్యమంత్రి వ్యవస్థాపకత పథకం) కింద పగటిపూట ఓరియంటేషన్ కార్యక్రమం మరియు మొదటి విడత గ్రాంట్‌ల పంపిణీలో నితీష్ మాట్లాడుతూ, ప్రజల కోసం పని చేసేవారిలో తాను ముందు ఉంటానని మరియు పని చేస్తూనే ఉంటానని నితీశ్ నొక్కి చెప్పారు.

ప్రత్యేక కేటగిరీ హోదా కోసం వాదిస్తూ, ఏదైనా పథకం వచ్చినప్పుడు కేంద్రం భారీగా ప్రచారం చేస్తుందని, అయితే అందులో 60 శాతం మొత్తాన్ని మాత్రమే పంచుతుందని, మిగిలిన 40 శాతం రాష్ట్రాలకు అందించాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేసారు.