Home   »  రాజకీయం   »   BRS పోయి కాంగ్రెస్ వచ్చిన ఎలాంటి మార్పు లేదన్న ప్రధాని..!

BRS పోయి కాంగ్రెస్ వచ్చిన ఎలాంటి మార్పు లేదన్న ప్రధాని..!

schedule mahesh

PM Modi | రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు గెలవడమే BJP లక్ష్యమని ప్రధాని మోదీ తెలిపారు. ఆదిలాబాద్‌లో జరిగిన విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇది ఎన్నికల సభ కాదని, అభివృద్ధి ఉత్సవ సభ అని పేర్కొన్నారు.

pm modi comments on brs and congress

PM Modi | రానున్న లోక్‌సభ ఎన్నికల్లో BJP 400 సీట్లు గెలవాలని ప్రధాని మోదీ తెలిపారు. నేడు ఆదిలాబాద్‌లో జరిగిన విజయ సంకల్ప సభలో ప్రధాని మాట్లాడుతూ.. ఇది ఎన్నికల సభ కాదని, అభివృద్ధి ఉత్సవ సభ అని తెలిపారు. 15 రోజుల వ్యవధిలో 5 AIIMS (All India Institute Of Medical Sciences)లను ప్రారంభించామన్నారు. గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకి దక్కిందన్నారు.

మోదీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలయ్యే గ్యారంటీ అని తెలిపిన ప్రధాని

మోదీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలయ్యే గ్యారంటీ అని ప్రధాని అన్నారు. దేశంలో 7 మెగా టెక్స్ టైల్ పార్కులను ఏర్పాటు చేయబోతున్నామని, అందులో ఒకటి తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని తెలిపారు. తెలంగాణలో సమ్మక్క సారక్క పేరుతో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కుంగిపోయిందన్నారు.

140 కోట్ల మంది ప్రజలే తన కుటుంబమన్న PM Modi

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో BRSతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కవుతోందన్నారు. BRS పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కూడా పాలనలో ఎలాంటి మార్పు రాలేదని ప్రధాని మండిపడ్డారు. ‘గతంలో మీరు తిన్నారు, ఇప్పుడు మేం తింటాం’ అనే రీతిలో కాంగ్రెస్ పాలన ఉందన్నారు. “140 కోట్ల మంది ప్రజలే తన కుటుంబమని, ప్రజల కలలను సాకారం చేసేందుకు తాను పని చేస్తున్నానని” ప్రధాని మోదీ తెలిపారు.

Also Read | నేడు ప్రధాని మోదీ తెలంగాణ టూర్..!