Home   »  రాజకీయంతెలంగాణ   »   Politics | విమోచన దినోత్సవం కోసం మొదలైన పొలిటికల్ వార్…?

Politics | విమోచన దినోత్సవం కోసం మొదలైన పొలిటికల్ వార్…?

schedule mahesh

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికర Politics పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణ Politics మొత్తం సెప్టెంబర్ 17వ తేదీ చుట్టూ తిరుగుతున్నాయి.

సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్నిపెద్ద ఎత్తున నిర్వహించి భారీ బహిరంగ సభపెట్టి కెసిఆర్ ను టార్గెట్ చేయాలని BJP భావిస్తుంది.

సెప్టెంబర్ 17 న BJP సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహించాలని ప్లాన్ చేసింది.

ఇక ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ వచ్చే అవకాశం ఉన్నట్టు BJP పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విమోచన/సమైక్యతా దినోత్సవ కార్యక్రమాలను, బహిరంగ సభ నిర్వహించేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నిన్న ఏర్పాట్లను సమీక్షించారు.

కాంగ్రెస్ పార్టీ పరేడ్ గ్రౌండ్స్ లేదా ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించాలని చూస్తుంది. అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనుమతి కోరింది.

పరేడ్ గ్రౌండ్స్ లేదా ఎల్బీ స్టేడియంలో అనుమతి లభించని పక్షంలో గచ్చిబౌలి స్టేడియంను వేదికగా చూస్తోంది.

ఈ సభ కోసం నిన్న తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే, తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ TPPC అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి,

ఇతర నేతలతో పాటు వేణుగోపాల్‌ గచ్చిబౌలి స్టేడియంను సందర్శించారు. నగర శివార్లలోని తుక్కుగూడ వద్ద ఈ-సిటీకి సమీపంలో బహిరంగ సభకు మరో వేదికను కూడా పార్టీ పరిశీలిస్తుంది.

ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు ప్రసంగించనున్నన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల భేరి మోగించనుంది.

 ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రూట్ మార్చారు. బిజెపి, కాంగ్రెస్ సభలకు కౌంటర్ సభగా బీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది.

సెప్టెంబరు 17 లేదా 18వ తేదీన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో పాలిటిక్స్ సెప్టెంబర్ 17వ తేదీ చుట్టూ తిరుగుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. అయితే సెప్టెంబర్ 17 పాలిటిక్స్ లో ఏ పార్టీ ప్రజల మద్దతును గెలుచుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే.