Home   »  రాజకీయం   »   Ravi Shankar |రవిశంకర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి..

Ravi Shankar |రవిశంకర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి..

schedule mounika

బీఆర్ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్(Ravi Shankar) ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.

అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కొడిమ్యాల మండల బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సుమారు 15 కిలోమీటర్లు ఉత్సాహంగా సాగిన బైక్ ర్యాలీ లో పాల్గొన్నారు

అనంతరం 1000 మంది బీఆర్ఎస్ పార్టీ లో చేరిక..

కొడిమ్యాల సర్పంచ్ ఏలేటి మమత నర్సింహారెడ్డి, పూడూరు ఉపసర్పంచ్ బండా లింగారెడ్డి, రామకిష్టాపూర్, డబ్బు తిమ్మాయపల్లి, చింతలపల్లి, కోనాపూర్, చెప్యాల గ్రామాల నుండి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ ని భారీ మెజారిటీతో గెలిపించి మూడో సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కొత్త పథకం ఏది లేదని అన్నారు.

ముఖ్యమంత్రి KCR అమలు చేస్తున్న పథకాలనే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చారు. కొడిమ్యాల మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. పోతారం కాలువ, మైసమ్మ చెరువు కాలువల ఇబ్బందులు తొలగిపోతాయి అన్నారు. త్వరలోనే నూతనంగా టెండర్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని అన్నారు.

దేశానికి ఆదర్శంగా KCR పరిపాలన : రవిశంకర్(Ravi Shankar)

అనంతరం చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్(Ravi Shankar) మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చిన అంశాలను మీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో అమలు చేసి చూపించాలని చాలెంజ్ విసిరారు. తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగం నడుస్తుంది.

దేశానికి ఆదర్శంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన సాగుతుంది. పరిపాలించడం రాదని వెక్కిరించారు. కరెంట్ వైర్ల పై బట్టలు ఆరేసుకుంటారని అన్నారు.

9 సంవత్సరాల క్రితం అనాథలాంటి తెలంగాణ. నెర్రెలు బారిన బీడు భూముల తెలంగాణ. తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 1001 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.. ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి లక్షా 20 వేల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతుంది. ప్రతి జిల్లా కేంద్రంలో ఉచిత స్టడీ సర్కిల్ లను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కేంద్రాలకు ఐటీ విస్తరణ. ఎటు చూసినా పచ్చని పంట పొలాలు దర్శనం ఇస్తున్నాయి.