Home   »  రాజకీయం   »   గత ప్రభుత్వం ప్రజల అవసరాలను విస్మరించింది : CM రేవంత్‌రెడ్డి

గత ప్రభుత్వం ప్రజల అవసరాలను విస్మరించింది : CM రేవంత్‌రెడ్డి

schedule mounika

హైదరాబాద్: తెలంగాణను పాలించిన గత ప్రభుత్వం ప్రజల అవసరాలను విస్మరించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. సికింద్రాబాద్‌లోని అల్వాల్‌ సమీపంలోని రాజీవ్‌ రహదారి వద్ద గురువారం ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని అల్వాల్‌ సమీపంలోని రాజీవ్‌ రహదారి వద్ద గురువారం ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి CM రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.

BRS పాలనలో నగరం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు: CM Revanth Reddy

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎలివేటెడ్‌ కారిడార్‌ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ప్రజల అవసరాలను విస్మరించిందని, కేంద్ర ప్రభుత్వంతో వివాదాల కారణంగా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో నగరం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్‌లో గంజాయి, పబ్బులు, డ్రగ్స్‌ మొదలైనవి పెరిగాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. రెండో దశ మెట్రో విస్తరణ పనులు 75 కిలోమీటర్ల మేర విస్తరించనున్నట్లు ఆయన ప్రకటించారు.

ALSO READ: తమ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తున్నవారిని వదిలిపెట్టాం: CM