Home   »  రాజకీయం   »   BSPని వీడిన RS ప్రవీణ్‌ కుమార్‌

BSPని వీడిన RS ప్రవీణ్‌ కుమార్‌

schedule ranjith
RS Praveen Kumar quits BSP

Praveen Kumar quits BSP | BSP రాష్ట్రాధ్యక్షుడు RS ప్రవీణ్‌ కుమార్‌ సంచలన ప్రకటన చేశారు. బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టిని వీడుతున్నట్లు ప్రకటించారు. RS ప్రవీణ్‌ కుమార్‌ X (ట్విట్టర్)లో ప్రియమైన బహుజనులారా, నేను ఈ మెసేజ్‌ని టైప్ చేయలేకపోతున్నాను, అయితే ఇప్పుడు కొత్త మార్గంలో వెళ్లే సమయం వచ్చినందున నేను దీన్ని తప్పక చేయాలి. దయచేసి నన్ను క్షమించండి మరియు నాకు వేరే మార్గం లేదు. బరువెక్కిన హృదయంతో బహుజన్ సమాజ్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు.

Praveen Kumar quits BSP | RS ప్రవీణ్‌ కుమార్‌ ట్వీట్‌

నా నాయకత్వంలో తెలంగాణలో ఇటీవలి నిర్ణయాల వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతినడం నాకు ఇష్టం లేదు. అదే సమయంలో నేను కొన్ని ప్రధాన సూత్రాలు మరియు వ్యక్తిగత పాత్రపై రాజీ పడకూడదనుకుంటున్నాను. నేను ఎవరినీ నిందించను, నన్ను నమ్మిన వారిని మోసం చేయకూడదు. నిన్న BSP-BRS పొత్తు వార్త బయటికి వచ్చిన వెంటనే BJP ఈ చారిత్రక పొత్తును భగ్నం చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. BJP కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. చివరివరకు బహుజన వాదాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటా’ అని ట్వీట్‌ చేశారు.

Also Read | కవిత అరెస్టుపై RS ప్రవీణ్ కుమార్ ట్వీట్