Home   »  రాజకీయం   »   కవిత అరెస్టుపై RS ప్రవీణ్ కుమార్ ట్వీట్

కవిత అరెస్టుపై RS ప్రవీణ్ కుమార్ ట్వీట్

schedule ranjith
RS Praveen Kumar | RS Praveen Kumar's tweet on Kavitha's arrest

RS Praveen Kumar | ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో BRS MLC కవితను ED అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమె అరెస్టుపై BSP రాష్ట్ర అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ స్పందించారు. కవిత అరెస్టు రాజకీయ కుట్రలో భాగమన్నారు. కవిత గారిని మోడీ ప్రభుత్వం EDని అడ్డంపెట్టుకొని చేసిన అక్రమ అరెస్ట్ ఒక బూటకం. దీన్ని BSP పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి అక్రమ అరెస్ట్‌లతో అదిరేది బెదిరేది లేదు. బెదిరితే తెలంగాణ వచ్చేది కాదు. ఈ దుశ్చర్య కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్న BJP, కాంగ్రెస్ పార్టీలు కుదుర్చుకున్న లోపాయకారి ఒప్పందంలో భాగమే అని అయన అన్నారు.

RS Praveen Kumar | కవిత అరెస్టుపై BSP రాష్ట్ర అధ్యక్షుడు ట్వీట్

EDతో BJP, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేయించిన ఈ అక్రమ అరెస్ట్‌ను తమ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా భావించి ఈ రెండు దోపీడీ దొంగల పార్టీలకు రేపు జరగబోతున్న భారత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తిరగబడి తగిన బుద్ధి చెపుతారు. మొన్న సాయిబాబా, సిసోడియా, నిన్న హేమంత్ సోరెన్, నేడు కల్వకుంట్ల కవిత, రేపు నువ్వో నేనో..? అందుకే తెలంగాణ సమాజం, యావత్తు దేశం BJP-కాంగ్రెస్ లను తక్షణమే తిరస్కరించాల్సిన అవసరం ఉంది’ అని RS ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.

Also Read | MLC Kavitha Arrest | ఎమ్మెల్సీ కవిత అరెస్ట్