Home   »  రాజకీయం   »   కాంగ్రెస్ 50 ఏళ్లలో చేయలేని పనిని పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసింది.

కాంగ్రెస్ 50 ఏళ్లలో చేయలేని పనిని పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసింది.

schedule mounika

ఖమ్మం: కాంగ్రెస్(Congress) 50 ఏళ్లలో చేయలేని పనిని పదేళ్ల లోపు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందని KCR అన్నారు.

ఖమ్మంలోని ఎన్నికల సభలో KCR ప్రసంగిస్తూ..కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేసి ఢిల్లీ బానిసత్వాన్ని అంగీకరిస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు. రెండు జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉండదని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలకు స్వేచ్చ ఉండదు: KCR

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్‌ కానీ, బీజేపీ కానీ తెలంగాణ జెండా పట్టలేదని, ఉద్యమానికి నాయకత్వం వహించలేదని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ కోసం పోరాడినప్పుడు మమ్మల్ని అవమానించారు, కాల్పులు జరిపి జైలుకు పంపారు. వాళ్ళకి(కాంగ్రెస్, బీజేపీ) మీ మీద ప్రేమ ఎందుకు ఉంటుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలకు స్వేచ్చ ఉండదని, వారి స్విచ్ ఢిల్లీలో కూర్చున్న వారి చేతుల్లో ఉంటుందని కేసీఆర్ అన్నారు.

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు (S.C.CL) నష్టాల్లో నడిచింది..

B.R.S హయాంలో విద్య, వైద్యం, రవాణా, రోడ్లు, విద్యుత్, తాగునీరు వంటి రంగాలు అభివృద్ధి చెందాయని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (S.C.C.L) నష్టాల్లో నడిచిందని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే సింగరేణి ఉద్యోగులకు మూడు శాతం ఇంక్రిమెంట్ ఇచ్చామని తెలిపారు.

కాంగ్రెస్ హయాంలో సింగరేణి టర్నోవర్‌ రూ.11 వేల కోట్లు మాత్రమే..

కాంగ్రెస్ హయాంలో సింగరేణి టర్నోవర్‌ రూ.11 వేల కోట్లు మాత్రమేనని, బీఆర్‌ఎస్‌ దానిని రూ.33 వేల కోట్లకు పెంచిందని కేసీఆర్‌ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో సింగరేణి లాభాలు రూ.419 కోట్ల నుంచి రూ.2,124 కోట్లకు పెరిగాయన్నారు. గతంలో సింగరేణి ఉద్యోగులకు ఏటా రూ.60 నుంచి 70 కోట్ల వరకు వాటా వచ్చేదని, ఈ ఏడాది ప్రభుత్వం బోనస్‌గా రూ.700 కోట్లు చెల్లించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అసమర్థత వల్లే సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా వచ్చిందని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుంటే కొత్తగూడెం జిల్లా అయ్యేది కాదు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుంటే కొత్తగూడెం జిల్లా అయ్యేది కాదన్నారు. కొత్తగూడెంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మెడికల్‌ కళాశాలను కూడా ఏర్పాటు చేసిందన్నారు. అలాగే నియోజకవర్గంలోని 13,500 ఎకరాల పోడు భూములకు సంబంధించి గిరిజనులకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసింది. 2004 నుంచి 2014 వరకు గత కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి రూ.900 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, గత తొమ్మిదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి రూ.12 వేల కోట్లు వెచ్చించిందని KCR అన్నారు.