Home   »  రాజకీయం   »   Severe |టికెట్ రాకపోవడంతో తీవ్ర అసహనం..

Severe |టికెట్ రాకపోవడంతో తీవ్ర అసహనం..

schedule mounika

కరీంనగర్ జిల్లా: మానకొండూర్ బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో తీవ్ర( severe) అసహనానికి గురైన ఆరేపల్లి మోహన్ గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

BRSలో టికెట్ రాకపోవడంతో తీవ్ర(severe) అసహనం..

మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే రసమయి చేతిలో ఓడిపోయారు. తర్వాత బీఆర్ఎస్ లో చేరి నామినేట్ పదవి ఆశించిన భంగపాటుకు గురవ్వడం, వెనువెంటనే ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన ఆరేపల్లి గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

తప్పుడు నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్తలు..

ఇప్పటికిప్పుడు కాంగ్రెస్, బీజేపీలలో ఏ పార్టీలో చేరాలో తెలియక తప్పుడు నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్తగా ఉన్నారని సమాచారం.

మానకొండూర్ నియోజకవర్గంలో స్థానికుడైన తనకు టికెట్ కేటాయించకపోవడంతో తన అనుచరులు BRS పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు.

అయితే కాంగ్రెస్ చేయి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా…కవ్వంపల్లిని కాదని ఆరేపల్లి కి టికెట్ దక్కుతుందనే ఆశలు లేవని బాహాటంగానే ఒప్పుకుంటున్నాడు.

కవ్వంపల్లి యే ఎమ్మెల్యే అని నియోజకవర్గ వ్యాప్తంగా సామాన్యుడు సైతం అనడంతో ఆరేపల్లికి వేరే మార్గం కనిపించకపోవడం గమనార్హంగానే ఉంది.

బీజేపీ కి సరైన అభ్యర్థి లేకపోవడంతో ఆ వైపుగా తొంగి చూసినా కాంగ్రెస్ నుండి బీజేపీ లోకి వెళ్లిన వారి పరిస్థితి
గుర్తుకొచ్చి ఆగినట్లు కూడా అత్యంత సన్నిహితుల దగ్గర నుండి సమాచారం.

బీఆర్‌ఎస్ పెద్దలు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో..

ఏ పార్టీలో చేరే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని, బీఆర్‌ఎస్ పార్టీ కోసం చాలా కష్టపడినట్లు మోహన్ వెల్లడించారు. మరి ఆరేపల్లి మోహన్ నిర్ణయంపై బీఆర్‌ఎస్ పెద్దలు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో వేచి చూడాలి.

 ఎఐఎఫ్బీ లోకి ఆహ్వానం పలికిన రాష్ట్ర నాయకత్వం..

ఇదిలా ఉంటే ఏఐఎఫ్ఫీ( ఆలిండియా ఫ్వార్డర్​ బ్లాక్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి వెళ్లి స్వయంగా కలిసి సింహం ఎక్కాలని ఆహ్వానించారు.

అయితే గత రెండు నెలలుగా జోజిరెడ్డి టచ్ లో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఒత్తిళ్లు అనుచరుల నుండి ఉందని, అనుచర వర్గం నిర్ణయం మేరకు ఏ పార్టీలోకి వెళ్ళాలనేది తెలియజేస్తానని చెబుతున్నారు.