Home   »  రాజకీయం   »   గ్రీన్‌ ఫెలోషిప్‌ అనే నూతన పథకం ప్రారంభం…!

గ్రీన్‌ ఫెలోషిప్‌ అనే నూతన పథకం ప్రారంభం…!

schedule vamshi

చెన్నై: తమిళనాడు CM స్టాలిన్‌ “గ్రీన్‌ ఫెలోషిప్‌” అనే నూతన పథకంను ప్రారంభించారు. ఇది వాతావరణ మార్పులపై అవగాహనను వ్యాప్తి చేయడానికి ఉద్దేశించబడింది. జిల్లాల్లో హరిత హారం కార్యక్రమాలను అమలు చేయడం అనేది దీని ముఖ్య లక్ష్యాలలో ఒకటి. దీని కింద 40 మందిని ఎంపిక చేయడం జరిగింది.“గ్రీన్‌ ఫెలోషిప్‌” ప్రోగ్రామ్ యొక్క నాలెడ్జ్ పార్టనర్ గా ఒక ప్రోగ్రామ్ లీడర్, నలుగురు రీసెర్చ్ అసోసియేట్‌లు ఉండనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణం, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా పరిపాలనల పర్యావరణ సంబంధిత కార్యక్రమాలలో సభ్యులు కీలక సహకారం అందించనున్నారు. నియమితులైన 40 మందిలో 38 మంది ఒక్కో జిల్లాపై దృష్టి సారిస్తారు. మరో ఇద్దరు రాష్ట్ర స్థాయిలో పనిచేస్తారు. హరిత హారం కార్యక్రమం యొక్క సభ్యులు రెండేళ్ల పదవీకాలం కలిగి ఉంటారు. వారికి నెలకు రూ. 60,000 స్టైఫండ్ లభిస్తుంది. కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా హరితహారం కార్యకర్తలు CM స్టాలిన్‌ను కలిసి మాట్లాడారు.