Home   »  రాజకీయం   »   Malkajigiri బీజేపీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ..

Malkajigiri బీజేపీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ..

schedule mounika

అత్యధిక ఓటర్లు ఉన్న మల్కాజిగిరి( Malkajigiri )నియోజవర్గంలో బీజేపీ టికెట్‌ కోసం అధిక సంఖ్యలో పోటీ నెలకొంది. దీంతో ఈ టికెట్‌ ఎవరిని వరిస్తోందనన్న ఉత్కంఠ కార్యకర్తలు, నేతల్లో కొనసాగుతోంది.

పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, తాజా కార్పొరేటర్లు ఇక్కడి నుంచి బరిలో దిగేందుకు తహతహలాడుతున్నారు. ఆశావహులు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నా టికెట్‌పై స్పష్టత వచ్చే వరకు పోటీ విషయంలో ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. ఒక వైపు సైలెంట్‌గానే ఉంటూనే లోలోపల తమ గాడ్‌ఫాదర్‌ల ద్వారా టికెట్‌ దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు నువ్వా? నేనా?

మల్కాజిగిరి(Malkajigiri ) పరిధిలోని ఆరు డివిజన్లలో ముగ్గురు బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించి సత్తా చాటారు. అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలో కూడా బీఆర్‌ఎస్‌ అభ్యర్ధులకు నువ్వా? నేనా? అన్నట్లుగా బలమైన పోటీ ఇచ్చారు.

బీజేపీ అభ్యర్థులు కేవలం కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు, పార్టీకి పట్టు ఉన్న ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్సీ రామ్‌చందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌, కార్పొరేటర్‌ శ్రావణ్‌కుమార్‌, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌, బీజేవైఎం జాతీయ కోశాధికారి పీఎం సాయిప్రసాద్‌ తదితరులు బలంగా ప్రయత్నిసున్నారు.

ఇతర పార్టీల నుంచి వలసలు వచ్చిన వారితో ఊపుమీద ఉన్న పార్టీపై కర్నాటక ఫలితాలతోపాటు రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ మార్పు కొంత ప్రభావం చూపింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కరీంనగర్ అసెంబ్లీలో రెండుసార్లు ఓడిపోవడంతో బీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడ వ్యూహాలు రచిస్తున్నారు.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని అధికార పార్టీ నేతలు కూడా కాంగ్రెస్‌, బీజేపీలకు కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

ఈ విషయాన్ని గ్రహించిన BJP పార్టీ అధిష్ఠానం కార్యకర్తల్లో నిరుత్సాహం ఆవహించకుండా పార్టీ కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేస్తోంది. అధిక సంఖ్యలో ఆశావహులు టికెట్‌ కోసం పోటీపడుతున్నారు.