Home   »  రాజకీయం   »   తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా..!

తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా..!

schedule raju

Telangana Governor | తెలంగాణ గవర్నర్ తమిళిసై ఇవాళ తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించారు. ఆమె తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, తమిళిసై లోక్ సభ ఎన్నికల్లో కన్యాకుమారి, చెన్నై సౌత్‌, తిరునల్వేలి నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం.

Tamilisai Soundararajan Resigned To Telangana Governor Post

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ గవర్నర్ (Telangana Governor) తమిళిసై సౌందరరాజన్ తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్న Telangana Governor

సంబంధిత వివరాల ప్రకారం.. తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవులకు తమిళిసై సౌందరరాజన్‌ రాజీనామా చేశారు. తమిళిసై తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. కాగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమిళిసై తమిళనాడు పార్లమెంట్ స్థానం నుంచి BJP తరపున పోటీ చేయనున్నారు. తమిళనాడులోని తూత్తుకుడి, చెన్నై సెంట్రల్ పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

తమిళిసై గారి రాజకీయ జీవితం

1999లో BJPలో చేరిన తమిళిసై 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర చెన్నై నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2011 ఎన్నికల్లో వేళచ్చేరి నియోజకవర్గం నుంచి పోటీచేసి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో All India Anna Dravida Munnetra Kazhagam (ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం, AIADMK) కూటమి నేతృత్వంలో తూత్తుకుడి నుంచి పోటీ చేసి DMK అభ్యర్థి కనిమొళి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత తమిళిసైను కేంద్రంలోని BJP ప్రభుత్వం తెలంగాణకు గవర్నర్‌గా పంపింది. ప్రస్తుతం ఆమె పుదుచ్చేరి ఇన్‌చార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Also Read: లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్న తమిళిసై…