Home   »  రాజకీయం   »   Teenmar Mallanna :వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వం.

Teenmar Mallanna :వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వం.

schedule mounika


హైదరాబాద్ : వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna )టీం ఏ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని టీం సభ్యులు తమ పోరాట గలాన్ని కొనసాగించాలని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.

బుధవారం హైదరాబాద్ లోని ఫిర్జాదీగూడలో తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల అధ్యక్షలు, ప్రధాన కార్యదర్శులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. హాజరైన వివిధ జిల్లాలకు చెందిన నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న టీం సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు .

వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్యెల్యే అభ్యర్థులను నిలబెట్టేందుకు కసరత్తు..

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. తాము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నామని, టీం సిద్ధాంతాలను ఏ పార్టీకి తాకట్టు పెట్టకుండా ప్రతీ జిల్లాలోని టీం సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఆయా నియోజకవర్గాలలో సభ్యులను తమ టీం తరఫున ఎన్నికల్లో ఎమ్యెల్యే అభ్యర్థులుగా నిలబెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర రాజకీయాలలో తాము కీలక పాత్ర పోషించి ప్రధాన పార్టీల గెలుపోటములను ప్రభావితం చేస్తామని స్పష్టం చేశారు.

మేడ్చల్ నుండి పోటీ చేయనున్న Teenmar Mallanna..

తాను మేడ్చల్ నుండి పోటీ చేసి వంద శాతం చట్టసభలో అడుగు పెడతామని చెప్పారు. త్వరలోనే మల్లన్న టీం భవిష్యత్ కార్యాచరణ విడుదల చేస్తామన్నారు. అన్ని నియోజకవర్గాలలో టీం సభ్యుల సూచనల మేరకు ఎమ్యెల్యే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టి గుర్తుపై తమ అభ్యర్ధులను పోటీలో దింపుతామని చెప్పారు. తాము ఏ పార్టీ కో టీమ్ ను తాకట్టు పెట్టకుండా సిద్ధాంతాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల్లో తమ పాత్ర పోషించడం జరుగుతుందని తెలిపారు.

అన్ని నియోజకవర్గాల్లో మల్లన్న టీం అభ్యర్థులు..

అన్ని నియోజకవర్గాల్లో మల్లన్న టీం తరఫున అభ్యర్థులను నిలబెడతామని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆయా జిల్లా కమిటీలు ప్రతిపాదనలను పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర సభ్యులు నాగయ్య, రాములు నాయక్, భావన చంద్ర శేఖర్, మహేష్, జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.