Home   »  రాజకీయం   »   నగరంలో నామినేషన్ల హడావిడి షురూ!

నగరంలో నామినేషన్ల హడావిడి షురూ!

schedule sirisha

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల కీలక ఘట్టం ప్రారంభమైంది. ఎన్నికల బరిలో పోటీని ఖరారు చేసే అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. తొలిరోజు అభ్యర్థులు తమ నామినేషన్లను (Nominations) దాఖలు చేశారు.

ఈ క్రమంలో మహానగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టారు. ఆర్వో కేంద్రానికి వంద మీటర్ల దూరంలో 144 సెక్షన్ విధించి ఏర్పాట్లు చేశారు.

తొలి రోజు నామినేషన్ (Nominations) వేయలేక పోయిన బీఎస్పీ అభ్యర్థి

తొలిరోజు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులే కాకుండా స్వతంత్ర, తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. మలక్ పేట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి రమేష్ ప్రచార నినాదాలతో బయలుదేరి సకాలంలో కేంద్రానికి చేరుకోకపోవడంతో తొలి రోజు నామినేషన్ వేయలేక పోయాడు. ఎన్నికల బరిలో ఉన్న మరో అభ్యర్థి మహ్మద్ అక్రమ్ అలీఖాన్ నామినేషన్లు దాఖలు చేశారు.

ప్రశాంతంగా ముగిసిన తొలిరోజు నామినేషన్లు

నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు కావడంతో అనుకున్నంత హడావుడి కనిపించలేదు. శుక్రవారం అత్యధికంగా స్వతంత్ర అభ్యర్థుల నుంచి నామినేషన్లు రాగా, కొన్ని నియోజకవర్గాల్లో ఒక్క నామినేషన్ కూడా రాలేదు. సికింద్రాబాద్‌ నుంచి శివసేన అభ్యర్థి సుదర్శన్‌ నామినేషన్‌ దాఖలు చేయగా, అడ్డగుట్ట నుంచి స్వతంత్ర అభ్యర్థి రాహుల్‌ గుప్తా నామినేషన్‌ సమర్పించుకున్నారు.

తొలిరోజు నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్‌ వెల్లడించారు.

మేడ్చల్‌లో తొలిరోజు 6 Nominations

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా తొలిరోజు ఆరు నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి 2, ఉప్పల్ నియోజకవర్గం నుంచి 2, మల్కాజిగిరి నుంచి 1, కూకట్‌పల్లి నుంచి 1 నామినేషన్లు దాఖలైనట్లు ప్రకటించారు.

తొలి రోజు నామినేషన్ల దాఖలు వివరాలు

నియోజకవర్గనామినేషన్ దాఖలు
మేడ్చల్శ్రీధర్ రెడ్డి (స్వతంత్ర)
మేడ్చల్ప్రవీణ్ కుమార్ రెడ్డి (స్వతంత్ర)
మల్కాజిగిరిజాజుల భాస్కర్ (శ్రమజీవి పార్టీ)
కుత్బుల్లాపూర్చంద్రశేఖర్ చలికా (స్వతంత్ర)
ఉప్పల్వేరుచిన్న ధనరాజ్ (స్వతంత్ర)
ఉప్పల్ఎం. మల్లేశం (తెలంగాణ ప్రజాజీవన రైతు పార్టీ)