Home   »  రాజకీయం   »   BRS లో చేరిన నాగం జనార్దన్, విష్ణు వర్ధన్ రెడ్డి..

BRS లో చేరిన నాగం జనార్దన్, విష్ణు వర్ధన్ రెడ్డి..

schedule mounika

హైదరాబాద్: ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మ‌క్షంలో నాగం జనార్దన్, విష్ణు వర్ధన్ రెడ్డి BRSలో చేరారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 30 రోజుల ముందు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మొదటి రెండు జాబితాలలో టిక్కెట్లు నిరాకరించబడిన కొందరు అసంతృప్త నాయకులు మంగళవారం భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) లో చేరారు.

తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి నాగం జనార్ధ‌న్ రెడ్డి, పీజేఆర్ తనయుడు.. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ నేత కొత్త జైపాల్ రెడ్డి తదితరులు బీఆర్ఎస్ లో చేరారు.

పాలమూరులో 14కి 14 సీట్లు గెలిచేందుకు నాగం జనార్ధన్ రెడ్డి కృషి చేయాలి :BRS అధినేత

ఈ సందర్భంగా కేసీఆర్ వీరితో పాటు వీరి అనుచరులకు గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసారి పాలమూరులో 14కి 14 సీట్లు గెలిచేందుకు నాగం జనార్ధన్ రెడ్డి కృషి చేయాలని సూచించారు. అందరూ అప్రమత్తంగా ఉండి.. ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం కోసం ప్రయత్నించాలని తెలిపారు సీఎం కేసీఆర్.

కాగా, మహాకూటమి తనకు నాగర్‌కర్నూల్ టికెట్ కేటాయించకపోవడంపై నాగం జనార్దన్ మనస్తాపం చెందగా, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌కు జూబ్లీహిల్స్ టిక్కెట్ ఇవ్వడంపై విష్ణు వర్ధన్ అసంతృప్తిగా ఉన్నారు.