Home   »  రాజకీయం   »   కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల..!

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల..!

schedule raju

Congress Kadapa MP candidate | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎన్నికల షెడ్యూల్ రావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. ఇప్పటికే సీఎం YS జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని YSRCP పక్కా ప్లాన్‌తో అభ్యర్థులను ప్రకటించింది. TDP, జనసేన, BJP (NDA కూటమి) సరికొత్త జోష్ తో తాము సిద్ధమంటూ కదనరంగంలోకి అడుగేశాయి. తాజాగా APCC చీఫ్ షర్మిల కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కోరిక మేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

YS Sharmila as Congress Kadapa MP candidate

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (AP Politics) వేగంగా మారుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రావడంతో అధికార, ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. YSR కాంగ్రెస్, TDP-జనసేన-BJP కూటమి అభ్యర్థులను దాదాపుగా ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అందినప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీనితో త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు YS షర్మిలారెడ్డితో అభ్యర్థుల ప్రకటనకు శ్రీకారం చుట్టాలని హైకమాండ్ యోచిస్తున్నట్లు తెలిపింది.

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా | Congress Kadapa MP candidate

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. YS షర్మిల కడప లోక్ సభ (కడప పార్లమెంట్) నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. YCPని ఢీకొట్టాలంటే కాంగ్రెస్ సీఎం వైఎస్ జగన్ రెడ్డిని ఢీకొట్టాల్సిందేనని, అందుకే కడప ఎంపీగా పోటీ చేయాలని షర్మిలపై AICC, APCC నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది.

రంగంలోకి దిగి పోటీ చేయాలని AICC నేతలు చెప్పడంతో కడప ఎంపీగా (Congress Kadapa MP candidate) పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు కానీ కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం పెద్ద చర్చే జరుగుతోంది. ఈ నెల 25న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. మొదటి పేరు షర్మిల అని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో AP, తెలంగాణ రాష్ట్రాల M.P అభ్యర్థుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది.

అవినాష్, షర్మిల మధ్య హోరాహోరీ పోరు

కడప నుంచి YCP తరపున YS అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డి సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి YS వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. తను నాయకుడు కాలేడని, పలువురి పేర్లు తెరపైకి వచ్చినా జగన్ మాత్రం అవినాష్ కు టిక్కెట్ ఇచ్చారు.

షర్మిల పోటీ చేయడం ఖాయమైతే కడపలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు బరిలోకి దిగినట్లే. అవినాష్, షర్మిల మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని రాజకీయ విశ్లేషకులు, నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఇటీవల షర్మిల వైజాగ్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు హఠాత్తుగా తను కడప నుంచి పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Also Read: APలో NDA ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్