Home   »  రాజకీయం   »   3 main guarantees |ప్రధాని.. మా మూడు ప్రధాన హామీల సంగతేంటి..? :KTR

3 main guarantees |ప్రధాని.. మా మూడు ప్రధాన హామీల సంగతేంటి..? :KTR

schedule mounika

హైదరాబాద్: మూడు ప్రధాన హామీల(3 main guarantees)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని మోదీని ప్రశ్నించారు. మూడు రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ రెండోసారి తెలంగాణకు వస్తున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీని తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా మాయమాటలు చెప్పి పాలమూరుకు ప్రధాని మోదీ ద్రోహం చేశారని కేటీఆర్ విమర్శించారు.

మోడీ ఇచ్చిన మూడు ప్రధాన హామీల(3 main guarantees)పై ప్రశ్నించిన ktr..

  • మన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఎప్పుడు ప్రాణం పోస్తుంది?
  • మన బయ్యారం స్టీల్ ప్లాంట్ ఎప్పుడు నిర్మిస్తారు?
  • మన పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎప్పుడు వస్తుంది?

ఎంతకాలం ఈ అబద్ధాల జాతర అని మండిపాటు..

పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర ? మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు.. ? గుండెల్లో గుజరాత్ ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా ? కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఉపిరి తీశారు లక్షల ఉద్యోగాలిచ్చే ఐ.టీ.ఐ.ఆర్ ను ఆగం చేశారన్నారు. ప్రధాని పదేళ్ల పాలనలో.. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలే కాదు, 140 కోట్ల మంది భారతీయులు మోసపోయారని అన్నారు. మీ మిత్రుడికి ఇచ్చిన హామీలే కాకుండా దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చారని ప్రశ్నించారు. మీ టర్మరిక్ బోర్డు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు తరహాలో పోల్ జిమ్మిక్కేనా అని ప్రశ్నించారు. మా మూడు ప్రధాన హామీలను నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం ఖాయమని, మళ్లీ వంద చోట్ల బీజేపీ డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం అని అన్నారు.