Home   »  రాజకీయం   »   Ambati Rambabu: ఏమైపోయావ్ “బ్రో’.. పవన్‌పై అంబటి సెటైర్లు

Ambati Rambabu: ఏమైపోయావ్ “బ్రో’.. పవన్‌పై అంబటి సెటైర్లు

schedule raju

అంధ్రప్రదేశ్: చంద్రబాబు (Chandrababu), పవన్‌ కళ్యాణ్‌లపై మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) సెటైర్లు వేశారు. రూ.118 కోట్ల ముడుపుల వ్యవహారంలో చంద్రబాబుకు వచ్చిన ఐటీ నోటీసులను ప్రస్తావిసూ.. ‘హలో … ఏమైపోయావ్ BRO? బాబు గారు బొక్కలోకి పోతానంటున్నాడు వచ్చి…పలకరించి , పులకరించి… పో ! అని ట్వీట్‌ చేశారు.

చంద్రబాబుపై అంబటి రాంబాబు (Ambati Rambabu) సెటైర్స్

చంద్రబాబు తప్పు చేశారు కాబట్టి ఆయనకు భయమేస్తుందని తనకు అనిపిస్తుందన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తారని ఆయనకు కలవచ్చినట్టుంది అంటూ సెటైర్ విసిరారు. చంద్రబాబును అరెస్టు చేయాల్సిన అవసరం ఉంటే అరెస్టు చేస్తారని.. అరెస్టు చేయాల్సిన అవసరం లేకపోతే అరెస్టు చేయరని చెప్పుకొచ్చారు. చట్టానికి అడ్డం వస్తే ఆయన్ని కూడా అరెస్టు చేస్తారన్నారు. ప్రాథమిక ఆధారాలు లేనిదే ఎవరి మీద ఏ విధమైన కేసులు పెట్టరన్నారు. చంద్రబాబు తనను అరెస్ట్ చేస్తారని సానుభూతి పొందే మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు దొంగైనా పవన్ కళ్యాణ్ నోరు విప్పడని.. ఆయన హీరోనే అంటారన్నారు. వాళ్ళిద్దరికీ ఉన్న బంధం అలాంటిదని తెలిపారు.

Also Read: ఐటీ నోటీసులపై చంద్రబాబు మౌనం ఎందుకు?: సజ్జల

2021-22 సంవత్సరానికి సంబంధించి దాదాపు రూ.118 కోట్ల ఆదాయం విషయంలో 153సీ కింద ఈ నోటీసులు ఇచ్చారు. వీటిని ఆగస్టు 4న ఇచ్చినట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు డిమాండ్ చేస్తున్నారు.

జగన్ లాబీయింగ్‌తో జారీ అయిన తప్పుడు నోటీసులంటూ టీడీపీ ప్రతి విమర్శలకు దిగుతోంది. ఇంతకీ ఆ నోటీసులు ఎందుకిచ్చారు, అందులో ఏముందన్నది కీలకంగా మారింది. రెండుమూడు రోజుల్లో నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో అంటూ తాజాగా రాయదుర్గంలో చంద్రబాబు చేసిన కామెంట్‌తో ఈ విషయం మరింత ఆసక్తికరంగా మారింది.

నోటీసులో ఏముంది.?

ఐటీ శాఖ చట్టం, 1961.. సెక్షన్ 132 ప్రకారం 2019 నవంబరు 1న మనోజ్ వాసుదేవ్ పార్థసానీ (ఎంవీపీ), అతని అసోసియేట్స్ కార్యాలయంలో ఐటీ శాఖాధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాలలో ఎంవీపీ ఫోన్, కన్సల్టెంట్స్‌కు చెందిన కంప్యూటర్లలో నేరారోపణకు సంబంధించిన పత్రాలు స్వాధీన చేసుకున్నారు.

‘‘బోగస్ ఇన్వాయిస్‌లతో మనోజ్ వాసుదేవ్ పార్థసానీ, మంగేష్ రాణె, అతుల్ సోనీ, వినయ్ నంగాలియా కలిసి డబ్బును కంపెనీలోకి తీసుకువచ్చినట్లు గుర్తించాం’’ అని ఐటీ శాఖ చెప్పింది.