Home   »  రాజకీయం   »   BRS party |BRS పార్టీకి మరో షాక్..

BRS party |BRS పార్టీకి మరో షాక్..

schedule mounika

కరీంనగర్ : బీఆర్ఎస్ పార్టీ(BRS party)కి మరో షాక్ తగిలింది. టికెట్ రాలేదని అసంతృప్తితో ఉన్న మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.

ఆయన్ని బుజ్జగించేందుకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

BRS party కి రాజీనామా ..

మీడియా సమావేశంలో తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ఆరెపల్లి మోహన్ ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ( BRS party)అనుసరిస్తున్న విధానాన్ని ప్రజలు అంగీకరించడం లేదు.

ప్రజల మెప్పు లేని పార్టీలో ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మానకొండూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ప్రయత్నం చేస్తా. ప్రశ్నించే గొంతుకను చూపిస్తాను.

ప్రజల అభివృద్ధి ఆకాంక్షించి పని చేస్తానని అరెపల్లి అన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు.

సర్పంచ్ స్థాయి నుంచి..
సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన వ్యక్తి ఆరెపల్లి. మానకొండూరు గ్రామ సర్పంచ్ గా ఏకధాటిగా 19 ఏళ్ల పాటు పని చేశారు.

2006లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో తిమ్మాపూర్ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచి, 2007 నుంచి 2009 వరకు కరీంనగర్ జిల్లా జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు. 2009 మానకొండూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ గా కూడా పని చేశారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 2014, 2018 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.
2019లో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. టికెట్ హామీ మీద గులాబీ పార్టీలో చేరిన ఆరెపల్లికి నిరాశ ఎదురుకావడంతో.. తాజాగా కారు దిగారు.

ఇదిలా ఉంటే A.I.F.B( ఆలిండియా ఫ్వార్డర్​ బ్లాక్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి వెళ్లి స్వయంగా కలిసి సింహం ఎక్కాలని ఆహ్వానించారు.

అయితే గత రెండు నెలలుగా జోజిరెడ్డి టచ్ లో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఒత్తిళ్లు అనుచరుల నుండి ఉందని, అనుచర వర్గం నిర్ణయం మేరకు ఏ పార్టీలోకి వెళ్ళాలనేది తెలియజేస్తానని చెబుతున్నారు.