Home   »  రాజకీయం   »   ప్రధాన న్యాయమూర్తి తో సీఎం KCR భేటీ

ప్రధాన న్యాయమూర్తి తో సీఎం KCR భేటీ

schedule sirisha

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధేతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం సమావేశమయ్యారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్యామ్ కోశి, జస్టిస్ అభినందన్ కుమార్ షావలి, జస్టిస్ వినోద్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మర్రి చెన్నారెడ్డి ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRDI) లో జరిగిన సమావేశంలో న్యాయస్థానాల్లో మౌలిక వసతుల కల్పన, సంబంధిత అంశాలపై కేసీఆర్, జస్టిస్ అలోక్ ఆధే చర్చించారు.