Home   »  రాజకీయం   »   Kalvakuntla Kavitha | నేడు జగిత్యాలకు రానున్నఎమ్మెల్సీ కవిత..

Kalvakuntla Kavitha | నేడు జగిత్యాలకు రానున్నఎమ్మెల్సీ కవిత..

schedule mounika

నేడు నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( Kalvakuntla Kavitha) జగిత్యాలకు రానున్నారు.

చల్‌గల్‌ మామిడి మార్కెట్‌లో నిర్వహించే జగిత్యాల నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన అనంతరం తొలిసారిగా జిల్లాకు వస్తున్న కల్వకుంట్ల కవితకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ నేతలు సర్వం సిద్ధం చేశారు.

ఇదే వేదికగా కాంగ్రెస్‌ నుంచి ముఖ్య నాయకులు గులాబీ పార్టీలో చేరనుండగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించనున్నారు.

చల్‌గల్‌ గ్రామ శివారులో ఉన్న మామిడి మార్కెట్‌ ఆవరణలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

జగిత్యాల పట్టణంతో పాటు, జగిత్యాల అర్బన్‌, రూరల్‌, సారంగాపూర్‌, బీర్‌పూర్‌, రాయికల్‌ మండలాల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభించి, మధ్యాహ్నం 3 గంటల దాకా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో కవిత జగిత్యాల నుంచే జైత్రయాత్ర ప్రారంభమవుతుందన్నట్లే జగిత్యాల నుంచే బీఆర్‌ఎస్‌ విజయ పరంపర మొదలు కావడం విశేషం.

ఈ సారి సైతం అదే రీతిలో అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి జైత్రయాత్ర ప్రారంభమయ్యేలా చూడాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు పట్టుదలతో శ్రమిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జగిత్యాల నియోజకవర్గ కేంద్రంలో నేడు ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో భారీ స్థాయిలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు.

కాగా 2014 నుంచి నిజామాబాద్ లోక్ సభ పరిధిలోని జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంపై ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక దృష్టి సారించిన సంగతి అందరికీ తెలిసిందే.

2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన కవిత.. జగిత్యాల నియోజకవర్గం నుంచి బీఆర్ ఎస్ అభ్యర్థిగా డాక్టర్ సంజయ్ కుమార్ ను ఎంపిక చేసి బరిలోకి దింపారు.

పార్టీలో చేరిన నెల రోజులకే ఎన్నికల రంగంలోకి దిగిన సంజయ్ ను గెలిపించేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( Kalvakuntla Kavitha) సర్వశక్తులు ఒడ్డి పోరాడారు.

కానీ సంజయ్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే సంజయ్ ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించిన కవితకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.

కాగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సంజయ్‌ కుమార్‌ 60వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు

జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం చేశారు.

నియోజకవర్గం కోసం కోరిన ప్రతి అభివృద్ధి పనిని ఎమ్మెల్సీ కవిత మంజూరు చేయించడంతో పాటు, అని సంక్షేమ పథకాలు జగిత్యాలలో అమలయ్యేలా చూశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రూ.300 కోట్లతో 4,500 డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్లను మంజూరు చేయించారు.