Home   »  రాజకీయం   »   Kishan Reddy :డిసెంబరు మొదటి వారంలోనే అసెంబ్లీ ఎన్నికలు..

Kishan Reddy :డిసెంబరు మొదటి వారంలోనే అసెంబ్లీ ఎన్నికలు..

schedule mounika

తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారం డిసెంబరులోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి(Kishan Reddy) స్పష్టం చేశారు.

రంగారెడ్డి జిల్లాలోని వనస్థలిపురంలో జరిగిన బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుల రాష్ట్రస్థాయి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిషన్​ రెడ్డి(Kishan Reddy) హాజరయ్యారు.

ఈ సందర్బంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరు నెలలు తర్వాత కాదు..డిసెంబరు మొదటి వారంలోనే అసెంబ్లీ ఎన్నికలు..అక్టోబరులో ఎన్నికలకు నోటిఫికేషన్​ రాకపోవచ్చని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి(Kishan Reddy) అన్నారు.

మంత్రి కేటీఆర్​ చేసిన సంచలన వ్యాఖ్యలపై.. ఏప్రిల్‌, మేలో ఎన్నికలు జరగవచ్చంటూ మంత్రి కేటీఆర్‌ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.

సెప్టెంబరు 17 సమైక్యతా దినమని ఏ పుస్తకంలో ఉందో 80 వేల పుస్తకాలు చదివిన సీఎం కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏ ముఖం పెట్టుకుని సమైక్యత దినం నిర్వహిస్తారని కేసీఆర్‌పై మండిపడ్డారు.

ఎంఐఎం మోచేతి నీళ్లు తాగుతూ, కారు స్టీరింగ్‌ను వారి చేతిలో పెట్టారన్నారు.

హైదరాబాద్‌ ముక్తి దివస్ ను కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని, ఇక్కడ ఎంఐఎంతో స్నేహం ఉంది కాబట్టే కాంగ్రెస్‌ ఆ కార్యక్రమాన్ని చేయడం లేదని విమర్శించారు.

మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించడమే కాకుండా లిక్కర్ తెలంగాణగా మార్చారని మండిపడ్డారు

సీఎం కేసీఆర్‌కు రూ.లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. మజ్లిస్‌ కనుసన్నల్లో బీఆర్‌ఎస్‌ పాలన సాగుతోందన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడింది బహుజనులు అయితే అధికారం దక్కింది మాత్రం కల్వకుంట్ల కుటుంబానికేనని దుయ్యబట్టారు.

బిజెపి గొంతు నొక్కాలని కెసిఆర్ చూస్తున్నారని కిషన్​రెడ్డి పేర్కొని, ఇప్పటికే కేసీఆర్ పై తీవ్ర అసహనంతో ఉన్న ప్రజలు చూస్తూ ఊరుకోరని తేల్చి చెప్పారు.

కేసీఆర్ కుటుంబమే కమీషన్ల కుటుంబమని ఆరోపించారు. కాళేశ్వరంతో పాటు ప్రతి ప్రాజెక్టులోనూ కల్వకుంట్ల ఫ్యామిలీకి కమీషన్లు వెళ్తున్న మాట నిజం కాదా ? అని ప్రశ్నించారు. కేటీఆర్ భాష, పద్ధతి బాగాలేదని కిషన్​రెడ్డి అన్నారు.

కాగా పరేడ్‌ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే విమోచన దినోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.