Home   »  రాజకీయం   »   CM STALIN |కుమారుడి వ్యాఖ్యల పై స్పందించిన సీఎం…

CM STALIN |కుమారుడి వ్యాఖ్యల పై స్పందించిన సీఎం…

schedule mahesh

TAMILANADU : తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి CM STALIN తొలిసారి స్పందించారు.

మంత్రి ఉదయనిధి స్టాలిన్ కేవలం వివక్షకు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడారని స్పష్టం చేశారు.

వాస్తవాలను ధ్రువీకరించడానికి అన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ బాధ్యత కలిగిన ప్రధాని, కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలు వాస్తవాలను విస్మరించడం నకిలీ వార్తలను ప్రచారం చేయడం బాధ కలిగించిందన్నారు.

సనాతన ధర్మం పై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని విమర్శలు చేస్తున్నారని CM STALIN అన్నారు.

సనాతన ధర్మంలోని అణిచివేత సూత్రాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే బీజేపీ, బీజేపీ అనుకూల శక్తులు ఉదయనిధి వైఖరిని సహించలేకపోతున్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఆ కారణంగానే సనాతన ఆలోచనలు గల వ్యక్తులను నరమేధం చేయాలని ఉదయనిధి పిలుపునిచ్చాడంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

బీజేపీ నిరంతరం పెంచి పోషిస్తున్న ఓ వర్గం సోషల్ మీడియా గ్రూపు ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ అబద్ధాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోందని స్టాలిన్ విమర్శించారు.

సనాతన ధర్మాన్ని నిర్మూలించండి అంటూ తమిళనాడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే.

ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం పై చేసిన వ్యాఖ్యలతో బిజెపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఉదయనిధి స్టాలిన్ పై మండిపడ్డారు.

కాగా సనాతన ధర్మం పై ఉదయనిది స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీలోని బీజేపీ నేతలు కూడా స్పందిస్తున్నారు.

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి ఉదయనిది స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి లో పర్యటించిన ఆమె, స్థానిక ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉదయనిది స్టాలిన్ వ్యాఖ్యల పై మండిపడ్డారు. ఆయన తక్షణం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించారు. అతి పురాతనమైన సనాతన ధర్మంపై ఈ విధంగా వ్యాఖ్యలు చెయ్యటం సమంజసం కాదన్నారు.