Home   »  రాజకీయం   »   Stalin |ఆలయాల్లోకి అర్చకులుగా మహిళలు… సీఎం ప్రకటన

Stalin |ఆలయాల్లోకి అర్చకులుగా మహిళలు… సీఎం ప్రకటన

schedule mahesh

తమిళనాడు: తమిళనాడులో ద్రావిడ పాలనావిధానంలో విధానంలో దేవాలయాల్లో పూజారులుగా మహిళలు ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి M.K Stalin ఈ రోజు అన్నారు.

ముఖ్యమంత్రి MK Stalin ఇలా అన్నారు. మహిళలు పైలట్‌లు, వ్యోమగాములుగా, IAS , IPS లు గా విజయాలు సాధించినప్పటికీ పవిత్రమైన

ఆలయ పూజారుల పాత్ర నుండి నిషేధించబడ్డారు. స్త్రీ దేవతల కోసం దేవాలయాలలో కూడా అపవిత్రంగా భావించారు. కానీ మార్పు చివరకు ఇక్కడ ఉందని ట్విట్టర్ X లో అన్నారు.

తమిళనాడులో మా ద్రావిడ మోడల్ ప్రభుత్వం అన్ని కులాల వారిని పూజారులుగా నియమించడం ద్వారా మహిళలు కూడా ఇప్పుడు గర్భగుడిలోకి అడుగుపెట్టి సమగ్రత, సమానత్వం యొక్క కొత్త శకాన్ని తీసుకురానున్నారని సీఎం అన్నారు.

అన్ని కులాలకు చెందిన మహిళలుకు తగిన శిక్షణ ఇచ్చి పూజారులుగా నియమించే రాష్ట్ర కార్యక్రమం కింద ముగ్గురు మహిళలని తిరుచిరాపల్లిలోని శ్రీరంగంలోని శ్రీ రంగనాథర్ దేవాలయం నిర్వహిస్తున్న పూజారి శిక్షణా పాఠశాలలో శిక్షణ పూర్తి చేసుకున్నారు.

దేవాలయాలలో పూజారులుగా బ్రాహ్మణేతరులను అనుమతించకపోవడాన్ని సంస్కరణవాద నాయకుడు పెరియార్ ఇ.వి.రామస్వామి ఒకప్పుడు తన గుండెల్లో ముల్లులా అభివర్ణించారు.

ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ఆలయాల్లో మహిళలే అర్చకులుగా విధులు నిర్వహిస్తున్నారని శిక్షణ పొందిన తర్వాత మహిళలను దేవాలయాల్లో పూజారులుగా నియమించుకోవచ్చని తమిళనాడు రాష్ట్ర దేవాదాయ శాఖ తెలిపింది.

కాషాయ స‌ర్కార్ అవినీతి పైనే ఫోక‌స్ : స్టాలిన్‌

స‌నాత‌న ధ‌ర్మం పై చ‌ర్చ‌కు దూరంగా ఉండాల‌ని, బీజేపీ అవినీతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు గుప్పించాల‌ని

DMK శ్రేణుల‌కు త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ పిలుపుని ఇచ్చారు.

స‌నాత‌న ధ‌ర్మాన్ని స‌మ‌ర్ధిస్తూ ముందుకెళ్లాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌న క్యాబినెట్ స‌హ‌చరుల‌కు చెప్ప‌డం ఈ వివాదం నుంచి రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌నే కాషాయ పార్టీ ఉద్దేశాల‌ను వెల్ల‌డిస్తోంద‌ని స్టాలిన్ పేర్కొన్నారు.

బీజేపీ త‌న వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు పాల్ప‌డే వ్యూహాల్లో చిక్కుకోవ‌ద్ద‌ని DMK పార్టీ శ్రేణుల‌ను CM కోరారు.

అవినీతి పై చ‌ర్చ జ‌రగ‌డాన్ని నిరోధించేందుకు స‌నాత‌న ధ‌ర్మం పై బీజేపీ దృష్టి సారిస్తోంద‌ని స్టాలిన్ గుర్తుచేశారు.