Home   »  రాజకీయం   »   ఐటీ నోటీసులపై చంద్రబాబు మౌనం ఎందుకు?: సజ్జల

ఐటీ నోటీసులపై చంద్రబాబు మౌనం ఎందుకు?: సజ్జల

schedule raju

ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు అవినీతిపై విచారణ వేగవంతం చేయాలని… ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. స్టేలు తెచ్చుకొని ఐటీ నోటీసుల నుంచి తప్పించుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన పాలన సమయంలో బోగస్ కంపెనీల నుంచి 118 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నట్లు స్పష్టమైందని, ఆయన అవినీతికి సంబంధించి బలమైన ఆధారాలు లభ్యమయ్యాయని చెప్పారు. ఐటీ నోటీసుల పై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని, ఈడీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.

 2017లో షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ తరపున కొన్ని ప్రాజెక్టులకు టెండర్ ప్రక్రియలో మనోజ్ వాసుదేవ్ పరద సామి అనే వ్యక్తి పాల్గొన్నారు. 2019లో పరదసామి కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ శాఖ సోదాలు చేసింది. అప్పుడు కొన్ని బోగస్ కాంట్రాక్టుల గుట్టు విప్పారని ప్రచారం జరుగుతోంది. షాపూర్‌జీకి వచ్చిన పనులను సబ్-కాంట్రాక్ట్‌కి ఎలా ఇచ్చారు. ఆ నిధులు ఎక్కడికి చేరాయో ఒప్పకున్నారని వార్తలు వచ్చాయి.

2020లో ఓసారి, 2021లో మరోసారి ఐటీ రైడ్స్ జరిగాయని, మనోజ్ దేవ్, శ్రీనివాస్ ఇళ్లలో అప్పుడు తనిఖీ చేశారన్నారు. ఎల్ అండ్ టీ, షాపూర్ జీ పల్లోంజీ ద్వారా షెల్ కంపెనీలకు వెళ్లి, అక్కడి నుండి చంద్రబాబుకు నిధులు అందినట్లు ఐటీ శాఖ చెప్పిందన్నారు. ఈ విషయమై చంద్రబాబు, లోకేశ్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. నోటీసులపై చంద్రబాబు పదేపదే చెప్పే సాంకేతిక అంశాలు సమాధానాలు కావని చెప్పారు.