Home   »  క్రీడలు   »   360 ప్లేయర్: ఫామ్ లో లేక 3 సార్లు GOLDEN DUCK…!

360 ప్లేయర్: ఫామ్ లో లేక 3 సార్లు GOLDEN DUCK…!

schedule raju

సూర్య కుమార్ యాదవ్ : టీమిండియా 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కెరీర్‌లో విషమ దశను ఎదుర్కొంటున్నాడు. టీ20ల్లో ధనాధన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న సూర్య.. వన్డే ఫార్మాట్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. క్రీజులో అడుగుపెట్టిన మొదటి బంతి నుంచే బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడే సూర్య.. హ్యాట్రిక్ గోల్డెన్ డక్స్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా గోల్డెన్ డక్స్ అయ్యి.. భారత ఓటమికి కారణమయ్యాడు.

360 ప్లేయర్ ఫై ఫ్యాన్స్ ఆగ్రహం:

దాంతో సూర్యకుమార్ యాదవ్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌటవ్వడం దారుణమని, ఇప్పటి ఏ బ్యాటర్ కూడా ఇంత దారుణంగా విఫలమవ్వలేదని మండిపడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ కాబట్టే వరుసగా గోల్డెన్ డకౌటైన జట్టులో అవకాశం దక్కించుకున్నాడని, ముంబై క్రికెటర్ కావడం, ముంబై ఇండియన్స్ అండదండలు, రోహిత్ శర్మకు సన్నిహితంగా ఉండటమే సూర్యకు వరుస అవకాశాలు తెచ్చిపెడుతున్నాయని ఆరోపిస్తున్నారు.