Home   »  క్రీడలు   »   2వ సెమిస్ లో సౌతాఫ్రికాను చిత్తు చేసి భారత్‌తో టైటిల్ పోరుకు సిద్దమైన ఆస్ట్రేలియా

2వ సెమిస్ లో సౌతాఫ్రికాను చిత్తు చేసి భారత్‌తో టైటిల్ పోరుకు సిద్దమైన ఆస్ట్రేలియా

schedule mahesh

కోల్‌కతా: నవంబర్ 16 గురువారం రోజున కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన 2వ సెమీ ఫైనల్‌లో (AUS VS SA MATCH) దక్షిణాఫ్రికాను మూడు వికెట్ల తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా, భారత్‌తో 2023 పురుషుల వన్డే ప్రపంచకప్ టైటిల్ పోరుకు సిద్ధమైంది.

aus vs sa match australia defeated South africa

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న సఫారీలు (AUS VS SA MATCH)

మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సఫారీ జట్టు 49.4 ఓవర్లలో 212 పరుగులకు కుప్పకూలింది. డేవిడ్‌ మిల్లర్‌ (116 బంతుల్లో 101; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో సఫారీలను ఆదుకున్నాడు. మిల్లర్ కు తోడుగా హెన్రిచ్‌ క్లాసెన్‌ (47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో రాణించాడు. ప్రపంచకప్ లో వరుస సెంచరీల తో ఊపుమీద వున్న డికాక్ 3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

మిల్లర్ సెంచరీ వృధా

అంతేకాకుండా కెప్టెన్‌ టెంబా బవుమా (0) తొలి ఓవర్‌లోనే ఖాతా తెరవకుండా వెనుదిరగాడు. మార్క్‌రమ్(10), డసెన్‌ (6) పరుగులతో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సఫారీ జట్టు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఈ దశలో క్లాసెన్‌, మిల్లర్‌ పోరాడి జట్టును తిరిగి పోటీలోకి తీసుకొచ్చిన ఆసీస్ బౌలర్ హెడ్‌ ఒకే ఓవర్‌లో క్లాసెన్‌, జాన్సన్‌లను ఔట్‌ చేసి సఫారీలను పూర్తిగా కోలుకోలేని దెబ్బతీశాడు. ఆసీస్‌ బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా 49.3 ఓవర్ లలో 212పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్‌, కమిన్స్‌ చెరో మూడు, హజిల్‌వుడ్‌, హెడ్‌ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.

62 పరుగులతో రాణించిన ట్రావిస్ హెడ్

అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన (AUS VS SA MATCH) ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్‌ హెడ్‌ (48 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నివ్వగా, స్టీవ్‌ స్మిత్‌ (62 బంతుల్లో 30), జోష్‌ ఇంగ్లిస్‌ (49 బంతుల్లో 28), డేవిడ్‌ వార్నర్‌ (18 బంతుల్లో 29 (ఒక ఫోర్‌, 4 సిక్సర్లు) పరుగులతో రాణించారు.

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కించుకున్న ట్రావిస్ హెడ్

చివర్లో స్టార్క్‌ (38 బంతుల్లో 16 నాటౌట్‌; 2 ఫోర్లు), కమిన్స్‌ (29 బంతుల్లో 14 నాటౌట్‌; 2 ఫోర్లు) అసమాన పోరాటంతో జట్టుకు విజయాన్ని అందించారు. సఫారీల బౌలర్లలో కోట్జీ, షంసీ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. హెడ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ (AUS VS SA MATCH) అవార్డు లభించింది.

ఐసీసీ టోర్నీల్లో తేలిపోతున్న సఫారీలు

విజయం సాధించాలంటే కష్టానికి తోడు ఆవగింజంత అదృష్టం ఉండాలని ఎందుకు అంటారో సఫారీలను చూస్తే తెలుస్తుంది. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో దుమ్మురేపే ప్రదర్శనలు చేస్తూ ప్రపంచంలో ఏ జట్టునైనా వణికించగల సఫారీలు ఐసీసీ టోర్నీల్లో మాత్రం తేలిపోతున్నారు. సఫారీల చరిత్ర కూడా అదే చెబుతుంది. ఇప్పటి వరకు ఐసీసీ ప్రపంచకప్ లో 5 సార్లు సెమిస్ లోకి ప్రవేశించిన సఫారీలు ఒక్కసారి కూడా ఫైనల్ కు వెళ్లలేకపోయారంటే ఆ జట్టు అదృష్టం ఎలా ఉందో ఆలోచించండి. చేతుల్లోకి వచ్చిన అవకాశాలను వదిలేసుకొని ‘చోకర్స్‌’అని ముద్ర వేసుకున్న సఫారీలు మరోసారి ఉట్టి చేతులతో ఇంటికి తిరుగుముఖం పట్టారు.

రికార్డు బ్రేక్ చేసిన డేవిడ్ మిల్లర్

వన్డే ప్రపంచకప్ టోర్నీలలో సౌతాఫ్రికా తరఫున సెమిస్ మ్యాచ్ లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఫాఫ్‌ డుప్లెసిస్‌ 2015 ప్రపంచకప్ సెమీస్‌లో కివీస్‌పై 82 పరుగులు చేసాడు. ఇదే టోర్నీలో క్వింటన్‌ డికాక్‌ ఆసీస్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో 78 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఇప్పుడు ఈ రెండు రికార్డులనూ మిల్లర్‌ బద్దలు కొట్టాడు.