Home   »  క్రీడలు   »   రెండో టెస్ట్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం

రెండో టెస్ట్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం

schedule mahesh

మెల్‌బోర్న్‌: మెల్‌బోర్న్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో (Australia won) గెలుపొందింది. 317 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ 237 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ అద్భుతంగా ఆడినా కీలక దశలో ఆటగాళ్లు చేసిన తప్పిదాలు, రిజ్వాన్ వివాదాస్పద రీతిలో ఔట్ కావడం పాక్ జట్టుకు ప్రతికూలంగా మారింది.

Australia won

ఆసీస్ ను ఆదుకున్న స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్ జోడి

శుక్రవారం రోజున 187/6 పరుగుల వద్ద ఆట ప్రారంభించిన ఆసీస్ 262 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఒక దశలో 16 పరుగులకే 4 వికెట్లు నష్టపోయింది. కానీ స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్ 153 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. జట్టు స్కోరు 40 పరుగుల వద్ద మార్ష్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను అబ్దుల్లా షఫీక్ జారవిడిచడం ఈ మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. అప్పుడే మార్ష్ ఔటై ఉండుంటే పాక్ ఈజీగా ఈ మ్యాచ్‌లో గెలిచి ఉండేది.

పాక్ ముందు 317 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన ఆసీస్

ఆస్ట్రేలియా (Australia won) తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులు చేయగా, పాకిస్థాన్ 264 పరుగులు చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా పాక్ ముందు 317 పరుగుల లక్ష్యాన్ని వుంచింది. భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో పాకిస్థాన్ 8 రన్స్ వద్ద ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ వికెట్ ఔటయ్యాడు. కానీ కెప్టెన్ షాన్ మసూద్, ఇమామ్ ఉల్ హక్ తో కలిసి రెండో వికెట్‌కు 41 పరుగులు జోడించాడు.

తర్వాత మూడో వికెట్‌కు బాబర్‌ అజామ్‌తో కలిసి 61 పరుగులు జోడించాడు. 61 పరుగులు చేసిన మసూద్ 110 పరుగుల వద్ద మూడో వికెట్ గా ఔటయ్యాడు. ఆ తర్వాత బాబర్ (41), సౌద్ షకీల్ (24) ఆరు ఓవర్లలోపే ఔట్ కావడంతో పాకిస్థాన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయితే వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (35), అఘా సల్మాన్ (50)తో పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచారు.

రెండో టెస్ట్ లో 10 వికెట్ల తో సత్తా చాటిన ప్యాట్ కమిన్స్

ఈ జోడీ పాక్ స్కోరు బోర్డును 200 పరుగుల మార్కును దాటి విజయంపై ఆశలు రేకెత్తించింది. కానీ కమిన్స్ విసిరిన బంతి రిజ్వాన్ రిస్ట్ బ్యాండ్ కు తగిలి వికెట్ కీపర్ చేతిలోకి వెళ్ళింది. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో ఆసీస్ డీఆర్ఎస్ కోరింది. రివ్యూ అనంతరం థర్డ్ అంపైర్ అతడిని ఔట్ గా ప్రకటించాడు. దింతో రిజ్వాన్ అసంతృప్తితో పెవిలియన్ బాట పట్టక తప్పలేదు.

పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం (Australia won)

రిజ్వాన్ ఔటైన తర్వాత పాక్ జట్టు తిరిగి పుంజుకోలేకపోయింది. తర్వాతి 8 ఓవర్లలో మిగిలిన 4 వికెట్లు కోల్పోయిన పాక్ జట్టు ఓటమిని (Australia won) మూట గట్టుకుంది. ఆసీస్ బౌల‌ర్ ప్యాట్ క‌మ్మిన్స్ రెండో ఇన్నింగ్స్‌లోనూ 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ మ్యాచ్‌లో అత‌ను మొత్తం 10 వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 57 టెస్టులు ఆడిన క‌మ్మిన్స్‌ రెండోసారి ప‌ది వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. ఇక మూడ‌వ టెస్టు జ‌న‌వ‌రి మూడ‌వ తేదీ నుండి సిడ్నీలో ప్రారంభం కానుంది.

స్కోరు బోర్డు
ఆస్ట్రేలియా 318, 262

పాకిస్థాన్ 264, 237

Also Read: ఉత్తర భారతాన్ని కప్పేసిన దట్టమైన పొగమంచు..!