Home   »  క్రీడలు   »   ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత జన్నిక్ సిన్నర్

ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత జన్నిక్ సిన్నర్

schedule mahesh

Australian Open 2024 | 2024 సీజన్‌ ప్రారంభ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో నయా చాంపియన్‌ అవతరించాడు. దశాబ్ద కాలంగా ముగ్గురి (ఫెదరర్‌, నాదల్‌, జకోవిచ్‌) చేతుల్లోనే తిరిగిన ట్రోఫీని ఈ సారి ఇటలీకి చెందిన 22 ఏండ్ల కుర్రాడు జన్నిక్ సిన్నర్ హస్తగతం చేసుకొన్నాడు.

australian-open-2024-mens-singles-winner-janic-s

Australian Open 2024 | ఈ సీజన్ లో తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో కొత్త చాంపియన్ అవతరించాడు. దశాబ్ద కాలంగా ముగ్గురి (ఫెడరర్, నాదల్, జొకోవిచ్) చేతిలోనే తిరిగిన ట్రోఫీని ఈ సారి ఇటలీకి చెందిన 22 ఏళ్ల యువకెరటం జన్నిక్ సిన్నర్ సొంతం చేసుకొన్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సిన్నర్ 3-6, 3-6, 6-4, 6-4, 6-3తో మూడో సీడ్ మెద్వెదేవ్‌ను ఓడించాడు.

తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న సిన్నర్

క్వార్టర్స్ లో ఐదో సీడ్ రుబ్లెవ్ పై గెలిచి సెమీఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ జకోవిచ్ కు షాకిచ్చాడు. 3 గంటల 44 నిమిషాల పాటు సాగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు కోల్పోయిన సిన్నర్‌ తర్వాత అద్భుతంగా పుంజుకొని విజయం సాదించాడు. ఆరోసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరిన మెద్వెదెవ్‌ ఒకసారి గెలిచి, ఐదోసారి రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Australian Open 2024 టైటిల్‌ నెగ్గిన తొలి ఇటలీ ప్లేయర్‌ సిన్నర్‌

ఇందులో తొలి రెండు సెట్‌లు గెలిచిన తర్వాత ప్రత్యర్థికి వరుసగా మూడు సెట్‌లు కోల్పోవడం మూడోసారి. మెల్‌బోర్న్‌ సెంటర్‌ కోర్ట్‌లో జరిగిన ఫైనల్లో సిన్నర్‌ 14 ఏస్‌లు కొట్టి 5 డబుల్‌ ఫాల్ట్స్‌ చేస్తే మెద్వెదెవ్‌ 11 ఏస్‌లు బాది 57 అనవసర తప్పిదాలు చేసాడు. తద్వారా ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన తొలి ఇటలీ ప్లేయర్‌గా సిన్నర్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ టైటిల్‌తో పాటు సిన్నర్‌ 17.22 కోట్ల ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్నాడు.

Also Read | హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకెళ్తున్న యువ భారత్