Home   »  క్రీడలు   »   హాఫ్ సెంచరీ తో రాణించిన తౌహీద్ … ఆసీస్ ముందు భారీ టార్గెట్ ఉంచిన బంగ్లాదేశ్

హాఫ్ సెంచరీ తో రాణించిన తౌహీద్ … ఆసీస్ ముందు భారీ టార్గెట్ ఉంచిన బంగ్లాదేశ్

schedule mahesh

CWC 2023 : ప్రపంచ క‌ప్ లో ఈ రోజు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్(BAN VS AUS) మధ్య పుణేలో జ‌రుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఓపెన‌ర్లు తంజిద్ హ‌స‌న్(36), లిట్టన్ దాస్ (36)పరుగులతో బంగ్లాకు మంచి శుభారంభం ఇవ్వడం జరిగింది.

హాఫ్ సెంచరీ తో రాణించిన తౌహీద్ (BAN VS AUS)

ఈ ఇద్దరు బ్యాట్సమెన్స్ తొలి వికెట్‌కు భాగస్వామ్య న్ని 76 ప‌రుగులు జోడించారు. అయితే స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ఈ ఇద్ద‌రూ ఔటవ్వడం తో బంగ్లా స్కోర్ కాస్త నిమ్మదించింది. ఆ తరవాత వచ్చిన బంగ్లా యంగ్‌స్ట‌ర్ తౌహిక్ హృద‌య్(74) హాఫ్ సెంచ‌రీతో రాణించ‌గా కెప్టెన్‌ న‌జ్ముల్ హొసేన్ శాంటో(45), మ‌హ్మ‌దుల్లా(32) రాణించారు.

చివర్లో మెహిదీ హ‌స‌న్ మిరాజ్(29) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడ‌డంతో బంగ్లా 8 వికెట్ల న‌ష్టానికి 306 ర‌న్స్ చేసింది. ఈ మెగాటోర్నీలో బంగ్లాదేశ్ 300 ప‌రుగుల దాటడం ఇదే మొద‌టిసారి, ఆసీస్ బౌల‌ర్ల‌లో సియాన్ అబాట్, ఆడం జంపా త‌లా రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.

నిలకడగా ఆడుతున్న ఆసీస్

లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ హెడ్ 11 పరుగులు మాత్రమే చేసి ఔటవ్వగా తరవాత వచ్చిన మార్ష్, వార్నర్ లు బంగ్లా బౌలర్లలను ధీటు ఎదుర్కొంటూ నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం ఆసీస్ 15 ఓవర్లలో 93/1 వికెట్ తో ఆడుతున్నారు. మార్ష్ 37బంతుల్లో 50పరుగులు, వార్నర్ 40 బంతుల్లో 34 పరుగుల తో ఆడుతున్నారు.