Home   »  క్రీడలు   »   త్వరలో భార‌త క్రికెట‌ర్ల‌కు గుడ్‌న్యూస్ చెప్పనున్న BCCI..!

త్వరలో భార‌త క్రికెట‌ర్ల‌కు గుడ్‌న్యూస్ చెప్పనున్న BCCI..!

schedule mahesh
bcci mulling over  to increase test match fee

BCCI | భారత క్రికెట్ బోర్డు త్వరలో టీమిండియా ఆటగాళ్లకు శుభవార్త అందించనుంది. టెస్ట్ ఫార్మాట్ (Test Cricket) మ్యాచ్ ఫీజు పెంపుపై క‌స‌ర‌త్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక సీజన్‌లో మొత్తం టెస్టు సిరీస్ ఆడిన ఆటగాళ్లకు బోనస్ చెల్లించేందుకు భారత క్రికెట్ బోర్డు సిద్దమవుతుంది. ఎందుకంటే, ఇటీవలి కాలంలో యువ క్రికెటర్లు సుదీర్ఘ టెస్ట్ ఫార్మాట్‌లో ఆడేందుకు ఆసక్తి చూపడం లేదు.

టెస్ట్ మ్యాచ్ ఫీజును పెంచనున్న బీసీసీఐ

భారత జ‌ట్టులోకి రావ‌డానికి ముందు రంజీల్లో ఆడ‌డం త‌ప్ప‌నిస‌రి అని BCCI చెప్పినా స‌రే ఇషాన్ కిష‌న్‌ (Ishan Kishan)తో పాటు శ్రేయ‌స్ అయ్య‌ర్‌ లాంటి ఆటగాళ్లు పెడ‌చెవిన పెడుతున్నారు. మ‌రోవైపు ఇంగ్లండ్ సిరీస్‌లో అరంగేట్రం చేసిన కుర్రాళ్లు ధ్రువ్ జురెల్ (Dhruv Jurel), స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌ (Sarfaraz Khan)లు అదరగొడుతున్నారు. అందుక‌ని జురెల్, సర్ఫ‌రాజ్ వంటి యువ ఆట‌గాళ్ల‌ను ప్రోత్స‌హిచేందుకు మ్యాచ్ ఫీజు పెంచ‌డ‌మే మార్గ‌మ‌ని బీసీసీఐ పెద్ద‌లు నిర్ణ‌యానికి వచ్చినట్టు తెలుస్తుంది.

ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా పేరుగాంచిన BCCI

ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా పేరుగాంచిన BCCI.. సెంట్రల్ కాంట్రాక్టుల ద్వారా క్రికెటర్లకు ఏటా కోట్లాది రూపాయలను అందజేస్తోంది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో A ప్లస్, A, B, C అనే నాలుగు కేటగిరీలు ఉన్నాయి. A ప్లస్‌లోని స్టార్ ప్లేయర్‌లు ఏటా రూ.7 కోట్లు, A కేటగిరీలోని ఆటగాళ్లు రూ.5 కోట్లు, B కేటగిరీ రూ.3 కోట్లు, C కేటగిరీ రూ.1 కోటి అందుకుంటున్నారు.

భారత ఆటగాళ్ల కేటగిరీలు

A+ విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, జ‌స్ప్రీత్ బుమ్రా, ర‌వీంద్ర జ‌డేజా.

A – హార్దిక్ పాండ్యా, అశ్విన్, షమీ, రిష‌భ్ పంత్, అక్ష‌ర్ ప‌టేల్.

B – పూజారా, కేఎల్ రాహుల్, శ్రేయ‌స్ అయ్య‌ర్, సిరాజ్, సూర్య‌కుమార్ యాద‌వ్, శుభ్‌మ‌న్ గిల్.

C – కుల్దీప్ యాద‌వ్, చాహ‌ల్, దీప‌క్ హుడా, వాషింగ్ట‌న్ సుంద‌ర్, శ్రీ‌క‌ర్ భ‌ర‌త్‌, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిష‌న్, సంజూ శాంస‌న్, శార్దూల్ ఠాకూర్, శిఖ‌ర్ ధావ‌న్, ఉమేశ్ యాద‌వ్.

Also Read | రాంచీ టెస్టులో భారత్ ఘన విజయం