Home   »  క్రీడలు   »   బెన్ స్టోక్స్ ODI లో పునరాగమనం

బెన్ స్టోక్స్ ODI లో పునరాగమనం

schedule vamshi

ఈ ఇంగ్లాండ్ అల్ రౌండర్ ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్‌తో జరగనున్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో తన ODI (one day international) ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించనున్నాడు. భారతదేశంలో అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న ICC ప్రపంచ కప్ 2023 నుండి ఇంగ్లాండ్ పురుషుల క్రికెట్ జట్టులోకి బెన్ స్ట్రోక్స్ పునరాగమనం తో ఇంగ్లాండ్ జట్టు మరింత పటిష్టంగా ఉండాలని భావిస్తున్నారు. స్టోక్స్ తన పనిభారాన్ని తగ్గిచుకోడానికి 13 నెలల క్రితం ODI ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. కఠినమైన అంతర్జాతీయ క్యాలెండర్‌ను కూడా కారణం గా చూపాడు. ఇంగ్లండ్‌ అభిమానులు ఇంత గొప్ప క్రికెటర్ పునరాగమనాన్ని చూసి సంతోషిస్తున్నారు.