Home   »  క్రీడలు   »   ఈజిప్టులో జరిగే చెస్ ఛాంపియన్‌షిప్ నుండి వైదొలిగిన భారత్

ఈజిప్టులో జరిగే చెస్ ఛాంపియన్‌షిప్ నుండి వైదొలిగిన భారత్

schedule mahesh

న్యూఢిల్లీ : అక్టోబరు 14 నుండి 23 వరకు ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్‌లో జరగనున్న ప్రపంచ క్యాడెట్
చెస్ ఛాంపియన్‌షిప్ (Chess Championship
) నుండి వైదొలగాలని ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రధాన కారణం ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, ఈ యుద్ధ ప్రభావం భారత చెస్‌పై పడింది.

చెస్ ఛాంపియన్‌షిప్ (Chess Championship) నుండి వైదొలిగిన భారత్

ఇజ్రాయెల్ -హమాస్ మధ్య గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఈజిప్టు లో పాల్గొనే భారత చెస్ క్రీడాకారులను పరిగణనలోకి తీసుకుని తగిన చర్చల తర్వాత మా ప్రతినిధి బృందం ప్రపంచ క్యాడెట్ చెస్ ఛాంపియన్‌షిప్-2023లో పాల్గొనరాదని నిర్ణయించబడిందన్నారు.

షార్మ్ ఎల్ షేక్ నుండి గాజా స్ట్రిప్ కేవలం 397 కి.మీ దూరం

షార్మ్ ఎల్ షేక్ నుండి గాజా స్ట్రిప్ కేవలం 397 కి.మీ దూరంలో ఉన్నందున మా యువ ఆటగాళ్ల భద్రత, భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత చెస్ బాడీ తెలిపింది. ఇంతలో ఈజిప్షియన్ చెస్ ఫెడరేషన్ (ECF) అధ్యక్షుడు డాక్టర్ హేషమ్ ఎల్జెండి మాట్లాడుతూ ఈ చెస్ చాంపియన్ షిప్ లో పాల్గొనే వారందరికీ హామీ ఇస్తూ ఇలా అన్నారు.

ఈజిప్టు ప్రభుత్వం షర్మ్ ఎల్ షేక్‌లో జరిగే చెస్ లో పాల్గొనే ఆటగాళ్లందరికీ భద్రతను కల్పిస్తుందని నేను మీకు హామీ ఇవ్వాలనుకుంటున్నానని అన్నారు. వరల్డ్ క్యాడెట్స్ చెస్ ఛాంపియన్‌షిప్స్ 2023 ఈజిప్టు యువజన & క్రీడల మంత్రి ఆధ్వర్యంలో షర్మ్ ఎల్ షేక్ ఈజిప్ట్ 14 – 27 అక్టోబర్ 2023లో జరుగనుంది.