Home   »  క్రీడలు   »   Cricket |న్యూజిలాండ్ వ‌ర‌ల్డ్ క‌ప్ టీం ప్రకటన కెప్టెన్ గా విలియ‌మ్స‌న్

Cricket |న్యూజిలాండ్ వ‌ర‌ల్డ్ క‌ప్ టీం ప్రకటన కెప్టెన్ గా విలియ‌మ్స‌న్

schedule mahesh

న్యూజిలాండ్: న్యూజిలాండ్ Cricket బోర్డు ఈ రోజు న్యూజిలాండ్ ప్ర‌పంచ క‌ప్ టీంను ప్ర‌క‌టించింది. కేన్ విలియ‌మ్స‌న్ కెప్టెన్‌గా 15మందితో కూడిన బృందం పేర్ల‌ను వెల్ల‌డించింది.

సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ లేని ఆటగాళ్లు జిమ్మీ నీష‌మ్, ట్రెంట్ బౌల్ట్‌ కు ఈ వరల్డ్ కప్ Cricket స్క్వాడ్‌లో చోటు ద‌క్కించుకున్నారు.

ఓపెన‌ర్‌ ఫిన్ అలెన్‌ పై న‌మ్మకం ఉంచిన సెలెక్ట‌ర్లు అత‌డిని ఎంపిక చేశారు. అయితే ఇంగ్లండ్‌ జట్టుతో జరిగిన వ‌న్డే సిరీస్‌కు

దూర‌మైన పేస‌ర్లు జేమీస‌న్, ఆడం మిల్నేల‌ను వ‌ర‌ల్డ్ క‌ప్ పోటీల‌కు ప‌రిగ‌ణించ‌క‌పోవ‌డం విశేషం. మ‌రో విష‌యం ఏంటంటే. స్పిన్ ఆల్‌రౌండ‌ర్‌ బ్రాస్‌వెల్ కూడా ఈ మెగా టోర్నీకి అందుబాటులో లేడు.

మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న విలియ‌మ్స‌న్ మ‌రోసారి జ‌ట్టును ముందు వుండి న‌డిపించ‌నున్నాడు. అత‌డితో పాటు సౌథీకి ఇది నాలుగో వ‌ర‌ల్డ్ క‌ప్.

అయితే విలియ‌మ్స‌న్ ఫిట్‌నెస్ ఎప్పుడు సాధిస్తాడు అనేది సమస్య గా మారింది. అప్ప‌టివ‌ర‌కూ వైస్ కెప్టెన్ లాథ‌మ్ కెప్టెన్ బాధ్యతలు నిర్వహించనున్నాడు.

చాప్‌మ‌న్, కాన్వే, మిచెల్, ఫిలిఫ్స్లు మొదటి వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ ఆడ‌బోతున్నారు. ఈ సారి న్యూజిలాండ్ టీం అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా ఉంది.

సీనియ‌ర్లు బౌల్ట్, టిమ్ సౌథీ, ఫెర్గూస‌న్,హెన్రీలతో కివీస్ ఫాస్ట్ బౌలింగ్ దుర్బేధ్యంగా క‌నిపిస్తోంది.

2015, 2019 క్రికెట్ ప్రపంచ కప్ రన్నరప్‌లుగా వున్నా న్యూజిలాండ్ టీం ఇవాళ అధికారిక ఆటగాళ్ల జాబితా ఖరారు చేయబడింది. ప్రపంచ కప్ 2023 కోసం న్యూజిలాండ్ టీమ్ స్క్వాడ్

న్యూజిలాండ్ స్క్వాడ్‌ : 

  • కేన్ విలియ‌మ్స‌న్(కెప్టెన్),
  • మార్క్ చాప్‌మ‌న్,
  • డెవాన్ కాన్వే,
  • టామ్ లాథ‌మ్(వైస్ కెప్టెన్,
  • వికెట్ కీప‌ర్),
  • డారిల్ మిచెల్,
  • జిమ్మీ నీష‌మ్,
  • గ్లెన్ ఫిలిఫ్స్,
  • ర‌చిన్ ర‌వింద్ర‌,
  • మిచెల్ సాంట్న‌ర్,
  • ఇష్ సోధీ, విల్ యంగ్,
  • ట్రెంట్ బౌల్ట్‌,
  • టిమ్ సౌథీ,
  • ల్యూకీ ఫెర్గూస‌న్,
  • మ్యాట్ హెన్రీ.

ఈ జట్టులో పెద్ద పేరున్న ఫాస్ట్ బౌలర్లు, బ్యాటమెన్స్ ,ఆల్ రౌండర్లు ఉన్నారు. రెండు వరుస వరల్డ్ కప్ లలో రన్నర్ అప్ తో సరిపెట్టుకున్న

న్యూజీలాండ్ జట్టు ఈ సారి ఎలాగైనా ప్రపంచ కప్ ట్రోఫీని సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రికెట్ టోర్నమెంట్ ప్రతి నాలుగు సంవత్సరాలకు మాత్రమే జరుగుతుంది.