Home   »  క్రీడలు   »   2 వేల పేజీలతో డేవిడ్ వార్నర్ ఆటోబయోగ్రఫీ..!

2 వేల పేజీలతో డేవిడ్ వార్నర్ ఆటోబయోగ్రఫీ..!

schedule mahesh

David Warner book: ఆస్ట్రేలియా క్రికెట్‌లో దూకుడైన ఆటతీరుతో గొప్ప ప్లేయర్ గా ముద్రవేసుకొన్న డేవిడ్ వార్నర్ ఇటీవలే టెస్ట్, వన్డే ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే రిటైరయిన డేవిడ్ వార్నర్ తన కెరీర్ మొత్తాన్ని ఆత్మకథ రూపంలో తీసుకురాబోతున్నాడు.

david-warner-autobiography-with-2-thousand-pages

2 వేల పేజీలతో David Warner ఆటోబయోగ్రఫీ

ఈ విషయాన్ని స్వయంగా వార్నరే తెలిపాడు. అంతేకాదు ఇందులో తాను వెల్లడించనున్న అంశాలు చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తాయని వార్నర్ వెల్లడించాడు. డేవిడ్ వార్నర్ ప్రైరీ క్లబ్ ఫైర్ పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్‌లతో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఆత్మకథ చాలా ఆసక్తికరంగా ఉంటుందన్నారు. ఈ పుస్తకం 2,000 పేజీల వరకు ఉంటుందని వార్నర్ తెలిపారు.

త్వరలో విడుదల కానున్న వార్నర్ బయోగ్రఫీ

డేవిడ్ వార్నర్ ఆటోబయోగ్రఫీ వస్తుందనగానే చాలా మంది క్రికెట్ అభిమానులు ట్యాంపరింగ్ ఘటనపై వార్నర్ ఏం చెబుతాడోనని ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ ను కుదిపేసిన ఈ ఘటన జరిగిన సమయంలో కెప్టెన్ గా స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ వున్నారు. ఈ బాల్ టాంపరింగ్ ఘటన తర్వాత ICC, క్రికెట్ ఆస్ట్రేలియా వీరిపై నిషేదం విధించింది.

దీనిపై ఇప్పటికి వార్నర్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఘటనపై తన పుస్తకంలో తప్పకుండా ప్రస్తావిస్తానని వార్నర్ తెలిపాడు. పుస్తకం చివరి దశలో ఉందని, కొన్ని సవరణలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 1500 పేజీలున్న ఈ పుస్తకానికి మరికొన్నిపేజీలు జోడిస్తున్నామని, ఈ పుస్తకంలో మొత్తం పేజీల సంఖ్య 2 వేల వరకు ఉంటుందని వార్నర్ తెలిపాడు.

Also Read: గుజరాత్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ..!