Home   »  క్రీడలు   »   ENG vs BAN | బంగ్లాదేశ్ ముందు భారీ టార్గెట్..

ENG vs BAN | బంగ్లాదేశ్ ముందు భారీ టార్గెట్..

schedule sirisha

ENG vs BAN | ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌ లో ఇంగ్లండ్ భారీ టార్గెట్ ని ఇచ్చింది. ధనాధన్ బ్యాటింగ్‌తో బంగ్లాదేశ్ కు భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. టాస్ ఓడిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది.

ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లలో డేవిడ్ మలాన్ సెంచరీ

ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లలో డేవిడ్ మలాన్ 107 బంతుల్లో 140 పరుగులు, 16 ఫోర్లు, 5 సిక్సర్లు, బంగ్లా బౌలర్లపై విరుచుకు పడ్డాడు. జో రూట్ 68 బంతుల్లో 82 పరుగులు (8 ఫోర్లు, 1 సిక్స్), జానీ బెయిర్‌స్టో 59 బంతుల్లో 52 పరుగులు (8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో సత్తా చాటుకున్నారు.

బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ నాలుగు వికెట్లు, షోరిఫుల్ ఇస్లాం మూడు వికెట్లు, కెప్టెన్ షకీబ్, తస్కిన్ అహ్మద్ చెరో వికెట్ సొంతం చేసుకున్నారు.

పోటీ పడి మరీ పరుగులు చేసిన బ్యాట్స్ మెన్లు

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్లు డేవిడ్ మలాన్, జానీ బెయిర్ స్టో శుభారంభం అందించారు. ఈ ఇద్దరు తొలి ఓవర్లలో కాస్త తడబడ్డారు. తర్వాత ఇద్దరూ పోటీ పడి మరి పరుగులు తీశారు. వీరిద్దరి ప్రయత్నాలకు బంగ్లా బౌలర్ల నుండి స్పందన లేదు.

వీరిద్దరూ తొలి వికెట్‌కు 100 పరుగులు చేశారు. దీంతో పాటు రెండు అర్ధ సెంచరీలు పూర్తయ్యాయి. 52 పరుగులు చేసిన బెయిర్ స్టోను షకీబ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 115 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి మధ్యలో కొంత బ్రేక్ వచ్చింది.

ENG vs BAN | తుది జట్లు

ఇంగ్లండ్

  • జానీ బెయిర్ స్టో
  • డేవిడ్ మలాన్
  • జో రూట్
  • హ్యారీ బ్రూక్
  • జాస్ బట్లర్ (కెప్టెన్)
  • లివింగ్ స్టోన్
  • క్రిస్ వోక్స్
  • స్యామ్ కరణ్
  • మార్క్ వుడ్
  • రీస్ టాప్లీ

బంగ్లాదేశ్

  • లిట్టన్ దాస్
  • తన్జిద్ హసన్
  • నజ్ముల్ షాంటో
  • మెహదీ హసన్ మిరాజ్
  • షకీబుల్ హసన్ (కెప్టెన్)
  • ముష్పికర్ రహీం
  • హ్రుదోయ్
  • మెహదీ హసన్
  • టస్కిన్ అహ్మద్
  • షోరిఫుల్ ఇస్లామ్
  • ముస్తఫిజుర్ రహ్మాన్