Home   »  క్రీడలు   »   ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా

ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా

schedule mahesh

ముంబై ఇండియన్స్: ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమిస్తూ ముంబై యాజమాన్యం సంచలన ప్రకటన చేసింది. రోహిత్ శర్మకు బదులుగా ముంబై కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్‌ పాండ్యాకు అప్పగించడం ఫై రోహిత్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

Mumbai Indians

Mumbai Indians కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా

ముంబై ఇండియన్స్ (Mumbai Indians) హార్దిక్ పాండ్యాను ఐపీఎల్ 2024 సీజన్‌కు కెప్టెన్‌గా శుక్రవారం (డిసెంబర్ 15) తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రకటించింది. తాజాగా గుజరాత్ టైటాన్స్ నుండి హార్దిక్ పాండ్యాను తీసుకున్న ముంబై ఇండియన్స్ టీంలోకి వచ్చి రాగానే ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ను నియమించింది. గుజరాత్ టైటాన్స్ కు రెండు సీజన్ల పాటు పాండ్యా కెప్టెన్ గా ఉండగా 2022లో టైటిల్ గెలిచింది.ఈ సంవత్సరం రన్నరప్‌గా నిలిచింది.

పాండ్యాను కెప్టెన్‌గా ప్రకటిస్తూ ప్రకటన విడుదల చేసిన ముంబై ఇండియన్స్

అయితే ముంబై రోహిత్ ను తప్పించి హార్దిక్ ను కెప్టెన్ గా చేయాలని ముంబై ముందే నిర్ణయించినట్లు తాజా నిర్ణయంతో అర్ధమవుతుంది. పాండ్యాను కెప్టెన్‌గా ప్రకటిస్తూ ముంబై ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. కెప్టెన్సీ పరంగా ముంబై ఇండియన్స్ చాలా కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైకి సుదీర్ఘకాలం పాటు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను పక్కనబెట్టి పాండ్యాను నియమించడం సంచలనంగా మారింది.

రోహిత్ శర్మ అత్యుత్తమ నాయకత్వ లక్షణాలకు ధన్యవాదాలు తెలిపిన జయవర్ధనే

ముంబై ఇండియన్స్‌ గ్లోబల్‌ పెర్‌ఫార్మెన్స్‌ హెడ్‌ మహేల జయవర్ధనే మాట్లాడుతూ ముంబై ఎప్పుడూ భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉంటుందని, ఫ్రాంచైజీ తత్వానికి అనుగుణంగానే కెప్టెన్సీని మార్చినట్లు చెప్పారు. I.P.L 2024 సీజన్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టబోతున్నాడని మహేళ తెలిపాడు. ఈ సందర్భంగా జయవర్ధనే మాట్లాడుతూ రోహిత్ శర్మ అత్యుత్తమ నాయకత్వ లక్షణాలకు ధన్యవాదాలు తెలిపారు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుండి తప్పించడానికి గల కారణాలను ముంబై వెల్లడించలేదు.

ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మ

అయితే క్రమంగా టీ20 ఫార్మాట్ కు దూరమవుతున్న రోహిత్ స్థానంలో కెప్టెన్ ను సిద్ధంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపిన ఘనత రోహిత్ శర్మకి దక్కుతుంది. రోహిత్ శర్మ ఐపీఎల్‌లో తప్ప ఏడాది పాటు టీ20 క్రికెట్ ఆడలేదు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు అతడు దూరమయ్యే అవకాశం ఉంది. రోహిత్ పదేళ్ల పాటు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.

Also Read: సూర్య మెరుపు సెంచరీ… మూడో T20లో భారత్ ఘ‌న విజ‌యం