Home   »  క్రీడలు   »   హైదరాబాద్‌లో తొలిసారిగా హార్స్ పవర్ స్పోర్ట్స్….

హైదరాబాద్‌లో తొలిసారిగా హార్స్ పవర్ స్పోర్ట్స్….

schedule sirisha

హైదరాబాద్‌: ఈక్వెస్ట్రియన్‌ లీగ్‌ హార్స్‌ పవర్‌ స్పోర్ట్స్‌ లీగ్‌ (Horse Power Sports League) ను తొలి సారిగా డిసెంబర్‌ నెలలో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు బుధవారం ప్రకటించారు.

కొత్త లీగ్ గురించి మరింత సమాచారాన్ని వెల్లడిస్తూ మొత్తం తొమ్మిది వారాల పాటు నిర్వహిస్తారు. కాగా ఇవి ప్రతి రోజు కాకుండా వారాంతాల్లో మాత్రమే లీగ్ జరుగుతుందని హెచ్‌పిఎస్‌ఎల్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ పాలడుగు తెలిపారు. “మేము ఒక సంవత్సరంలో రెండు ఎడిషన్లను ప్లాన్ చేస్తున్నాము.

Horse Power Sports League తొలిసారిగా హైదరాబాద్‌లో ప్రారంభం

హార్స్‌ పవర్‌ స్పోర్ట్స్‌ లీగ్‌ (Horse Power Sports League) గురించి మరిన్ని వివరాలు వచ్చే నెలలో వెలువడే అవకాశం ఉందని వెల్లడించారు. మొదటి ఎడిషన్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి విండోలో మరియు రెండవ ఎడిషన్ జూన్, జూలై & ఆగస్టు విండోలలో నిర్వహిస్తారు. దీనిలో మొత్తం ఏడు జట్లు ఈ పోటీలో ఉంటాయని ఆయన ప్రకటించారు.

హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ లీగ్ గొప్ప కాన్సెప్ట్ అని, దేశంలో ఈక్వెస్ట్రియన్ క్రీడను అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాము.

“లీగ్ నేటి సమాజానికి గుర్రాలు మరియు మానవుల మధ్య వేల సంవత్సరాల అనుబంధం ఉంది. దేశంలో గుర్రపు పందెం యొక్క చరిత్రను, గుర్రపు స్వారీ జూదం కాదని చూపించే ప్రయత్నం చేయనున్నట్లు తెలిపారు.

మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గుర్రపు క్రీడలను పన్నుల రూపంలో ప్రోత్సహించి కొంత సడలింపును కల్పించాలి’’ అని అన్నారు. విద్యార్థులకు మోసపూరిత వాగ్దానాలు చేస్తున్న థర్డ్-పార్టీ ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గోథే-ఇన్స్టిట్యూట్ తెలిపింది.