Home   »  క్రీడలు   »   నాకూ IPL లో ఆడాల‌ని ఉంది…పాక్ బౌల‌ర్ హసన్ ఆలీ

నాకూ IPL లో ఆడాల‌ని ఉంది…పాక్ బౌల‌ర్ హసన్ ఆలీ

schedule mahesh

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న క్రీడలలో ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పనక్కరలేదు. అంతేకాకూండా దేశ, విదేశాల నుండి క్రీడాకారులు IPL పాల్గొనడం కోసం ఎంతో ఉత్సహాన్ని కనబరుస్తారు. తాజాగా పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీ కూడా తనకు IPL పాల్గొనాలని వుందని తన మనసులోని మాటను వెల్లడించాడు.

Hasan Ali

IPL లో ఆడాల‌ని ఉందన్న Hasan Ali

ఆటగాళ్లకు ఆదాయాలు మరియు అభిమానులకు వినోదాన్ని అందించే ఈ మెగా టోర్నమెంట్‌లో ఆడేందుకు ప్రపంచం నలుమూలల నుంచి క్రికెటర్లు ఆసక్తి చూపుతుంటారు. ఒకటి రెండు సీజన్లలో రాణిస్తే చాలు కళ్లు బైర్లు కమ్మే ఆదాయంతో, ఈ లీగ్‌లో చాలా మంది అంతర్జాతీయ స్థాయి స్టార్ ప్లేయర్లు తమ జాతీయ జట్టు మ్యాచ్‌ల నుంచి తప్పున్నరంటే ఈ లీగ్ క్రేజ్ ను మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి పాపులర్ లీగ్‌లో ఆడాలని ఆశిస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెటర్ హసన్ అలీ (Hasan Ali) తెలిపాడు. అవకాశం వస్తే ఐపీఎల్‌లో ఆడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

భవిష్యత్‌లో అవకాశం వస్తే తప్పకుండా IPLలో ఆడతానన్న హసన్

హసన్ అలీ(Hasan Ali) మాట్లాడుతూ ప్రపంచంలోని ప్రతి క్రికెటర్ ఐపీఎల్‌లో భాగం కావాలని కోరుకుంటాడు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్, నాకు కూడా ఐపీఎల్ ఆడాలని ఉంది. భవిష్యత్‌లో అవకాశం వస్తే తప్పకుండా ఐపీఎల్‌లో ఆడతానని అన్నాడు. IPL 2008 ప్రారంభ సీజన్‌లో చాలా మంది పాకిస్తాన్ క్రికెటర్లు IPLలో ఆడారు. షోయబ్ మాలిక్, షోయబ్ అక్తర్, కమ్రాన్ అక్మల్, సోహైల్ తన్వీర్ మరియు షాహిద్ అఫ్రిది ప్రారంభ సీజన్‌లో ఆడారు.

పాక్ ఆటగాళ్లు IPL లో పాల్గొనకుండా నిషేధం విధించిన BCCI

అయితే ఆ తర్వాత 2009లో ముంబైపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేయడంతో పాక్ క్రికెటర్లను ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతించలేదు. పాక్ ఆటగాళ్లపై నిషేధం ఉన్నప్పటికీ పాక్ ఆటగాడు అజర్ మహ్మద్ ఐపీఎల్‌లో ఆడాడు. అయితే తాను బ్రిటన్ పౌరుడిగా ఐపీల్ లో పాల్గొన్నాడు.ఇటీవలే బ్రిటన్ పౌరసత్వం పొందిన పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ కూడా రానున్న సీజన్లలో ఐపీఎల్‌లో ఆడే అవకాశం ఉంది.

Also Read: పాకిస్థాన్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన బాబర్ ఆజాం