Home   »  క్రీడలు   »   5వ టెస్ట్ మొదటి ఇనింగ్స్ లో 218 ప‌రుగుల‌కు ఇంగ్లాండ్ ఆలౌట్

5వ టెస్ట్ మొదటి ఇనింగ్స్ లో 218 ప‌రుగుల‌కు ఇంగ్లాండ్ ఆలౌట్

schedule mahesh
ind vs eng 5th test 1st inings england 218 allout

IND vs ENG 5th test 1st innings | ధర్మశాల టెస్టులో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) మరియు రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ భరతం పట్టారు. టర్నింగ్ పిచ్ పై భారత్ స్పిన్ త్రయం చెలరేగడంతో పర్యాటక జట్టు 218 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలే (79) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతున్న అశ్విన్ ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. దాంతో స్టోక్స్ సేన చేతులెత్తేసింది.

IND vs ENG 5th test 1st innings

తొలి సెషన్‌ నుంచి ధర్మశాల పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా మారింది. దాంతో లెగ్‌బ్రేక్‌లు, గూగ్లీలతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లను కుల్దీప్ బెంబేలెత్తించాడు. బెన్ డకెట్ (27)ను కుల్దీప్ వెనక్కి పంపాడు. ఈ వికెట్ తో కుల్దీప్ వికెట్ల వేట ప్రారంభించాడు.

5 వికెట్లతో సత్తా చాటిన కుల్దీప్ యాదవ్

ఆ తర్వాత ఉప్ప‌ల్ టెస్టు హీరో ఓలీ పోప్ (11)ను అవుట్ చేశాడు. లంచ్ తర్వాత భీకర ఫామ్ లో ఉన్న క్రాలే (79)ను కుల్దీప్ సూపర్ డెలివరీతో బౌల్డ్ చేశాడు. భారీ షాట్లతో ఎదురుదాడికి దిగిన డేంజరస్ జానీ బెయిర్ స్టో (29), బెన్ స్టోక్స్ (0)ల వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రాంచీ టెస్టు హీరో జో-రూట్ (26)ని జడేజా ఔట్ చేసాడు.

మరోసారి హాఫ్ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్

కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్‌ను కుల్దీప్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. అదే ఓవర్లో టామ్ హర్ట్లీ (6), మార్క్ వుడ్ (0)లను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. 194/8తో టీ కి వెళ్లిన ఇంగ్లండ్, అశ్విన్ స్పిన్ ఉచ్చులో పడి కొద్దిసేపటికే చివరి రెండు వికెట్లను నష్టపోయింది. అనంతరం బరిలోకి దిగిన టీమిండియా 103 పరుగులతో వికెట్ నష్టపోకుండా ధీటుగా ఆడుతుంది. భారత యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (57) మరోసారి హాఫ్ సెంచరీతో రాణించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (47) పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు.

Also Read | అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్..!