Home   »  క్రీడలు   »   కివీస్ ను చిత్తు చేసిన టీమిండియా… ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరిన భారత్

కివీస్ ను చిత్తు చేసిన టీమిండియా… ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరిన భారత్

schedule mahesh

IND VS NZ WORLD CUP 2023 | 2019 ప్రపంచకప్ సెమిఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓటమి ఇప్పటికి భారత క్రికెట్‌ అభిమానులను వేధించే అంశం, 2021 ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓటములకు నిన్న ముంబై వాంఖేడ్ స్టేడియంలో కివీస్ తో జరిగిన సెమిస్ మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

IND VS NZ : బుధవారం ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా టీమిండియా, న్యూజిలాండ్‌ (IND VS NZ WORLD CUP 2023) జట్ల మధ్య కీలకమైన సెమీఫైనల్‌ పోరు జరిగింది. మొదట టాస్ గెలిచిన టీమిండియా ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. వాంఖ‌డే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా బరిలోకి దిగాయి.

ప్రపంచకప్ లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన బ్యాట్సమెన్ రోహిత్ శర్మ రికార్డు

మొదట బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ తనదయిన బ్యాటింగ్ తో కివీస్ బౌలర్ల ఫై సిక్స‌ర్ల‌తో విరుచుకుపడ్డాడు. ప్రపంచకప్ లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన బ్యాట్సమెన్ రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో రోహిత్ శర్మ ఇప్ప‌టి వ‌ర‌కు 50 సిక్స‌ర్లు నమోదు చేసాడు. కివీస్ తో జరిగిన ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్‌లో రోహిత్ నాలుగు సిక్స‌ర్లు బాదాడు. దీంతో వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచుల్లో అత‌ను కొట్టిన మొత్తం సిక్స‌ర్ల సంఖ్య 50 కు చేరింది. ఇండియా 8.2 ఓవ‌ర్ల‌లో 71 ర‌న్స్ వద్ద రోహిత్ శ‌ర్మ 47 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు, గిల్ 21 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు.

హాఫ్ సెంచరీతో రాణించిన గిల్

రోహిత్‌ శర్మ క్రీజులో ఉన్నప్పుడు నెమ్మదిగా ఆడిన శుభమాన్ గిల్‌ అతడు ఔట్‌ అయ్యాక స్కోరు వేగాన్ని పెంచే బాధ్యతను తీసుకున్నాడు. ఫెర్గూసన్‌ వేసిన పదో ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. అతడే వేసిన 13వ ఓవర్లో 4,6 బాదడంతో భారత జట్టు స్కోర్ 100 పరుగులు దాటడం జరిగింది. రచిన్‌ రవీంద్ర వేసిన 14వ ఓవర్లో మూడో బంతికి సింగిల్‌ తీసిన గిల్‌ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 15 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్‌ ఒక వికెట్‌ నష్టపోయి 118 పరుగులు చేయడం జరిగింది. గిల్‌ (52 నాటౌట్‌), విరాట్‌ కోహ్లీ (16 నాటౌట్‌) క్రీజులో ఉన్నారు.

రిటైర్డ్‌ హార్ట్‌గా వెనుతిరిగిన గిల్

41 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసిన గిల్ సెంచరీ దిశగా సాగాడు(65 బంతుల్లో 79, 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అయితే ఈ మధ్యలోనే గిల్ కు కండరాలు పట్టేడయంతో రిటైర్డ్‌ హార్ట్‌గా పెవిలియన్ చేరాడు. తరువాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ తో కలిసి విరాట్‌ కోహ్లీ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తరువాత శ్రేయస్‌ అయ్యర్‌ సాయంతో కోహ్లీ భారత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

రోహిత్‌ ఔటవ్వగానే క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ ఆరంభంలో నెమ్మదిగా ఆడినా ఆ తరవాత అయ్యర్‌ తో కలిసి స్కోరు వేగాన్ని పెంచే బాధ్యత తీసుకున్నాడు. రచిన్‌ రవీంద్ర వేసిన 27వ ఓవర్లో 6, 4 బాదాడు. ఇదే ఓవర్లో ఆఖరి బంతికి సింగిల్‌ తీసిన కోహ్లీ అర్థ సెంచరీ పూర్తీ చేసుకున్నాడు. 30 ఓవర్లకు టీమిండియా 214 పరుగులు చేయగా కోహ్లీ ( 65 నాటౌట్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (19 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు.

50వ సెంచరీ చేసి సచిన్ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

అనంతరం దూకుడు పెంచిన విరాట్, సౌథీ వేసిన 30వ ఓవర్లో సిక్సర్‌ బాదిన విరాట్‌ తర్వాత బౌల్ట్, ఫిలిప్స్‌, సౌథీలు వేసిన ఓవర్లలో ఫోర్లు బాదాడు. బౌల్ట్ వేసిన 36వ ఓవర్లో మరో ఫోర్‌ కొట్టి సెంచరీకి దగ్గరయ్యాడు. 90లలోకి వచ్చాక కాస్త నెమ్మదించిన కోహ్లీ ఫెర్గూసన్‌ వేసిన 42వ ఓవర్లో డబుల్‌ రన్స్ తీసి 50వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో సచిన్‌ 462 ఇన్నింగ్స్‌లలో 49 సెంచరీలు చేయగా కోహ్లీ మాత్రం 291 ఇన్నింగ్స్‌లలోనే 50 సెంచరీలు పూర్తి చేసాడు. విరాట్ కోహ్లీ 113 బంతుల్లో 117 పరుగులు ఔటయ్యాడు.

సెంచరీలతో రాణించిన అయ్యర్, విరాట్ కోహ్లీ

ఇంతలోనే అర్థ సెంచరీ పూర్తీ చేసుకున్న అయ్యర్‌ దూకుడు పెంచాడు. రచిన్‌ రవీంద్ర వేసిన 45 వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన అయ్యర్‌ సౌథీ వేసిన 48వ ఓవర్లో తొలి బంతికి భారీ సిక్సర్‌ బాది 99లోకి చేరుకున్నాడు. తర్వాత బంతికే సింగిల్‌ తీసి సెంచరీ పూర్తీ చేసుకున్నాడు.

అయ్యర్‌కు ప్రపంచకప్( IND VS NZ WORLD CUP 2023) లో ఇది రెండవ సెంచరీ, 67 బంతుల్లోనే అయ్యర్‌ సెంచరీ పూర్తి చేసాడు. 70 బంతుల్లో పరుగులు105 చేసి బౌల్ట్‌ వేసిన 49వ ఓవర్లో నాలుగోబంతికి బౌండరీ బాదిన అయ్యర్‌ మరుసటి బంతికే మిచెల్‌ కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆఖర్లో కెఎల్‌ రాహుల్‌ (20 బంతుల్లో 39 నాటౌట్‌, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్‌ స్కోరు 397/4 చేసింది. పూర్తీ కివీస్ బౌలర్లలో సౌథీ 3 వికెట్లు బౌల్ట్ 1 వికెట్ దక్కించుకున్నారు.

లక్ష్య ఛేదనలో తడబడ్డ కివీస్

IND VS NZ WORLD CUP 2023లో అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కివీస్ జట్టు ఓపెనర్లు ను ఈ టోర్నీలో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా అదరగొడుతున్న వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ ఓపెనర్ల ఔట్ చేసాడు. డెవాన్‌ కాన్వే (15 బంతుల్లో 13, 3 ఫోర్లు), రచిన్‌ రవీంద్ర (22 బంతుల్లో 13, 3 ఫోర్లు)లను వెనక్కి పంపి కివీస్‌ను ఆదిలోనే దెబ్బ తీసాడు.

ది ఓవర్లు ముగిసేసరికి కివీస్‌ స్కోరు 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌తో పాటు డారెల్‌ మిచెల్‌లు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన కేన్‌ మామ, మిచెల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించే పనిలోపడ్డాడు. సిరాజ్‌ వేసిన 11వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన మిచెల్‌, తర్వాత వేసిన జడేజా ఓవర్లో కూడా రెండు బౌండరీలు కొట్టాడు. సిరాజ్‌ వేసిన 13వ ఓవర్లో ఓ బౌండరీతో పాటు బైస్‌ రూపంలో మరో బౌండరీ లభించింది.

షమీ వేసిన 17వ ఓవర్లో మిచెల్‌ కూడా 6, 4 కొట్టడంతో కివీస్‌ స్కోరు 100 పరుగులు దాటింది. ఈ ఇద్దరి వికెట్లు తీయడానికి భారత బౌలర్లు చాలా కష్టపడాల్సి వచ్చింది. జడేజాతో పాటు కుల్‌దీప్‌ కూడా వికెట్లు తీయడంలో తంటాలు పడ్డారు. మరోవైపు మిచెల్‌ జడేజా వేసిన 23వ ఓవర్లో సింగిల్‌ తీసి అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.

IND VS NZ WORLD CUP 2023లో హాఫ్ సెంచరీతో రాణించిన విలియమ్సన్‌

ఈ వరల్డ్‌ కప్‌ (IND VS NZ WORLD CUP 2023) లో అతడికి ఇది నాలుగో హాఫ్‌ సెంచరీ, ఇక కుల్దీప్‌ వేసిన 26వ మూడో బంతిని లాంగాన్‌ దిశగా సింగిల్‌ తీసిన కివీస్‌ సారథి కూడా హాఫ్‌ సెంచరీ పూర్తీ చేసాడు. ఈ ఇద్దరి దూకుడుతో 26 ఓవర్లు ముగిసేసరికి కివీస్‌ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 165 పరుగులు చేసింది. మిచెల్‌ ( 64నాటౌట్), విలియమ్సన్‌ (50 నాటౌట్‌)లు క్రీజులో ఉన్నారు.

బ్యాటర్‌ డారెల్‌ మిచెల్‌ వీరబాదుడు బాదుతుండటంతో కొండంత లక్ష్యం కూడా కరిగిపోతున్న తరుణంలో టీమిండియా వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ మరోసారి తన మాయ చేసాడు. వరుసగా రెండు వికెట్లు తీసి కివీస్‌ను ఒత్తిడిలో పడేశాడు. కేన్‌ విలిమయ్సన్‌తో పాటు టామ్‌ లాథమ్‌ కూడా ఔట్‌ అవడంతో భారత శిబిరంలో మళ్లీ ఆశలు మొదలయ్యాయి.

డారెల్ మిచెల్ సెంచరీ వృధా

ఓ వైపు వికెట్స్ పడుతున్న ధాటిగా ఆడిన మిచెల్‌85 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకుని భారత అభిమానుల గుండెల్లో భయాన్ని నింపాడు. 34 ఓవర్లు ముగిసేసరికి కివీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

బ్యాటర్‌ డారెల్‌ మిచెల్‌ వీరబాదుడు బాదుతుండటంతో కొండంత లక్ష్యం కూడా కరిగిపోతున్న తరుణంలో టీమిండియా వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ మరోసారి తన మాయ చేసాడు. వరుసగా రెండు వికెట్లు తీసి కివీస్‌ను ఒత్తిడిలో పడేశాడు. కేన్‌ విలిమయ్సన్‌ 69 పరుగులు చేసి ఔటయ్యాడు. టామ్‌ లాథమ్‌ కూడా ఔట్‌ అవడంతో భారత శిబిరంలో మళ్లీ ఆశలు మొదలయ్యాయి.

7వికెట్లతో కివీస్ నడ్డి విరిచిన మహమ్మద్ షమీ

ఓ వైపు వికెట్స్ పడుతున్న ధాటిగా ఆడిన మిచెల్‌ 85 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకుని భారత అభిమానుల గుండెల్లో భయాన్ని నింపాడు. మిచెల్‌ (119 బంతుల్లో 134; 9 ఫోర్లు, 7 సిక్సర్లు), గ్లెన్‌ ఫిలిప్స్‌ (41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడారు. కానీ భారత పేసర్ షమీ దాటికి 327 పరుగులకు కివీస్‌ కుప్పకూలింది. భారత బౌలర్లలో షమీ 7 వికెట్లు తీయగా, బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అఫ్ ది మ్యాచ్ గా నిలిచిన మహమ్మద్ షమీ.

వరల్డ్‌ కప్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా షమీ రికార్డు

IND VS NZ WORLD CUP 2023 వన్డే ప్రపంచకప్‌లో ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతూ భారత విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్న టీమిండియా వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ మరో అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్‌ కప్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.