Home   »  క్రీడలు   »   IPL-2024 సీజన్ మొత్తానికి దూరమైన భారత స్టార్ పేసర్..

IPL-2024 సీజన్ మొత్తానికి దూరమైన భారత స్టార్ పేసర్..

schedule mahesh

Mohammed Shami | వరల్డ్ కప్ లో సంచలన బౌలింగ్‌తో దుమ్మురేపిన భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ప్రస్తుతం గాయంతో ఇబ్బంది పడుతున్నాడు.

india-pacer-mohammed-shami-ruled-out-of-ipl-2024

Mohammed Shami | ప్రపంచకప్‌లో సంచలన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్న భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ప్రస్తుతం గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత, ఎడమ మడమ గాయంతో షమీ జట్టుకు దూరమయ్యాడు. చీలమండ గాయం కారణంగా ఈ 33 ఏళ్ల పేసర్ మొత్తం IPL-2024 సీజన్‌కు దూరం కాబోతున్నాడు. ఈ చీలమండ గాయానికి షమీ బ్రిటన్‌లో శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు.

వాస్తవానికి జనవరి చివరి వారంలో షమీ లండన్‌లో చికిత్స తీసుకున్నాడు. ప్రత్యేక ఇంజెక్షన్లు తీసుకున్న మూడు వారాల తర్వాత తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చని బ్రిటన్ వైద్యులు తెలిపారు. అయితే ఆ ఇంజెక్షన్లు పనిచేయకపోవడంతో షమీ గాయం ఏమాత్రం తగ్గలేదు. షమీ గాయానికి శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని BCCI అధికారి ఒకరు వెల్లడించారు. శస్త్రచికిత్స కోసం షమీ త్వరలో బ్రిటన్ వెళ్లనున్నాడని, IPL తాజా సీజన్ లో ఆడే అవకాశం లేదన్నారు. కాగా మార్చి 22న IPL-2024 ప్రారంభం కానుంది.

Also Read | మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న IPL 17వ సీజన్‌..!