Home   »  క్రీడలు   »   ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత సెయిలర్‌ విష్ణు శరవణన్‌

ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత సెయిలర్‌ విష్ణు శరవణన్‌

schedule mahesh

Vishnu Sarvanan | గతేడాది హాంగ్జౌ వేదికగా ముగిసిన ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత సెయిలర్ విష్ణు శరవణన్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. భారతదేశం నుంచి సెయిలింగ్‌లో అర్హత సాధించిన తొలి సెయిలర్‌ విష్ణునే కావడం గమనించదగ్గ విషయం.

indian-sailor-vishnu-sarvanan-qualified-for-the

Vishnu Sarvanan | గతేడాది హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత సెయిలర్ విష్ణు శరవణన్‌ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందాడు. సెయిలింగ్ క్రీడలో భారత్ నుండి అర్హత సాధించిన తొలి సెయిలర్ విష్ణునే కావడం విశేషం. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో జరిగిన ILCA-7 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అతను అద్భుత ప్రదర్శన చేసి పారిస్‌ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు.

సెయిలింగ్‌లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి ప్లేయర్ Vishnu Sarvanan

ఈ ఈవెంట్‌లో ఆసియా దేశాల నుండి ఏడు బెర్త్‌లు ఉండగా, ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న హాంకాంగ్, థాయ్‌లాండ్, సింగపూర్ దేశాలకు చెందిన నావికులను శరవణన్ వెనక్కి నెట్టాడు. ప్రస్తుతం ఆర్మీలో సుబేదార్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల విష్ణు, ఓవరాల్‌గా ఈవెంట్‌లో 174 స్కోరు సాధించాడు. ఈ ఈవెంట్‌లో మొత్తం 152 మంది పాల్గొనగా విష్ణు 26వ స్థానంలో నిలిచాడు. ఆసియా దేశాల తరపున విష్ణు అగ్రస్థానంలో నిలిచాడు. 2019లో జరిగిన అండర్-21 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విష్ణు కాంస్యం సాధించాడు.

Also Read | సూపర్‌ సిక్స్‌లో న్యూజిలాండ్ ను చిత్తు చేసిన టీమిండియా