Home   »  క్రీడలు   »   T20 ఫార్మాట్‌లో 100 వికెట్లు తీసిన తొలి ఐర్లాండ్ బౌల‌ర్‌గా మార్క్ రికార్డ్

T20 ఫార్మాట్‌లో 100 వికెట్లు తీసిన తొలి ఐర్లాండ్ బౌల‌ర్‌గా మార్క్ రికార్డ్

schedule mahesh

Ireland Bowler : జింబాబ్వేతో జ‌రుగుతున్న T20 సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్ బౌల‌ర్ మార్క్ అడైర్‌(Mark Adair) కొత్త రికార్డు నెలకొల్పాడు. బ్యాట‌ర్లు ఆకాశ‌మే హ‌ద్దుగా విరుచుకుప‌డే T20 ఫార్మాట్‌లో 100 వికెట్లు తీసిన తొలి ఐర్లాండ్ బౌల‌ర్‌గా రికార్డు సృష్టించాడు.

Ireland Bowler

100 వికెట్లు తీసుకున్న బౌలర్ల క్లబ్ లో చేరిన Ireland Bowler మార్క్ అడైర్‌

హారారే స్పోర్ట్స్ క్ల‌బ్‌ లో జ‌రిగిన మ్యాచ్‌లో జింబాబ్వే కెప్టెన్ సికింద‌ర్ ర‌జాను ఔట్ చేసిన మార్క్ (Ireland Bowler) 100 వికెట్లు తీసుకున్న బౌలర్ల క్లబ్ చేరాడు. 2019లో T20ల్లో అరంగేట్రం చేసిన‌ మార్క్ 7.70 ఎకాన‌మీతో వంద వికెట్లు తీసుకున్నాడు. అందులో మూడు నాలుగు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌లు కూడా వున్నాయి. అయితే టెస్టులు, వ‌న్డేల్లో క‌లిపి మార్క్ 65 వికెట్లు పడగొట్టాడు. ఇక బ్యాటింగ్‌లో దంచికొట్టిన మార్క్ తన ఖాతా లో రెండు హాఫ్ సెంచ‌రీలు నమోదు చేసుకున్నాడు.

హాఫ్ సెంచ‌రీతో రాణించిన సికింద‌ర్ ర‌జా

జింబాబ్వేతో జ‌రిగిన తొలి T20 మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 147 ర‌న్స్ చేసి ఆల్ ఔట్ అయ్యింది. ఆ త‌ర్వాత జింబాబ్వే ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించినా ఆదిలోనే ఓపెన‌ర్ల వికెట్లు కోల్పోయింది. అయితే మొద‌ట‌ మూడు వికెట్లతో దెబ్బ‌కొట్టిన ఐర్లాండ్ జట్టు ఆశలపై జింబాబ్వే సార‌థి సికింద‌ర్ ర‌జా హాఫ్ సెంచ‌రీతో నీళ్లు చ‌ల్లాడు.

మూడు మ్యాచ్ ల T20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన జింబాబ్వే

148 ప‌రుగుల ఛేద‌న‌లో సికింద‌ర్ ర‌జా కేవ‌లం 42 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 65 ప‌రుగులతో రాణించాడు. జోరు మీదున్న అత‌డిని మార్క్ ఔట్ చేసాడు. కానీ, ట్రెవ‌ర్ గ్వాండ్(5 నాటౌట్) క‌డ‌దాకా పోరాడ‌డంతో జింబాబ్వే ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్ ల T20 సిరీస్‌లో 1-0తో జింబాబ్వే ఆధిక్యంలోకి వెళ్ళింది.