Home   »  క్రీడలు   »   7వ సారి ATP ఫైనల్స్ టోర్నీ గెలుపొంది రికార్డు సృష్టించిన నోవాక్ జకోవిచ్

7వ సారి ATP ఫైనల్స్ టోర్నీ గెలుపొంది రికార్డు సృష్టించిన నోవాక్ జకోవిచ్

schedule mahesh

నొవాక్ జకోవిచ్: టాప్ సీడ్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ రికార్డు స్థాయిలో ఏడో సారి ATP ఫైనల్స్ లో గెలుపొంది రికార్డ్ సృష్టించాడు. ఆదివారం రాత్రి ఇట‌లీలోని ట్యూరిన్‌లో జ‌రిగిన ATP ఫైన‌ల్లో నొవాక్ జకోవిచ్ స్థానిక ఆట‌గాడు జ‌న్న‌క్‌ సిన్న‌ర్‌ను ఓడించి ATP ఫైనల్లో (Novak Djokovic won the ATP Finals)కొత్త చరిత్ర సృష్టించాడు.

Novak Djokovic won the ATP Finals

Novak Djokovic won the ATP Finals

గంట 43 నిముషాల పాటు జరిగిన మ్యాచ్‌లో 6-3, 6-3 తేడాతో సెర్బియన్ స్టార్ జకోవిచ్ తన అత్యుత్తమ ఆటతీరును కనబరచి విజయం సాదించాడు. ఇది నా జీవితంలో చాలా గొప్ప సీజన్ అందులో ఎలాంటి సందేహం లేదన్నాడు. ఈ రోజు నేను మేటి టెన్నిస్ ప్లేయర్, లోకల్ ప్లేయర్ జానిక్‌పై టైటిల్ సాధించడం (Novak Djokovic won the ATP Finals)జీవితం లో మార్చిపోలేని అనుభూతి అని మ్యాచ్ అనంతరం జకోవిచ్ తెలిపాడు.

2023లో 3 మేజర్ టైటిల్స్ కైవసం చేసుకున్న జకోవిచ్

ఒకే ఏడాది లో 3 మేజర్ టైటిల్స్ ను కైవసం చేసుకున్న జకోవిచ్ ఈ ఏడాది జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుపొందాడు. అందులో కూడా రికార్డు స్థాయిలో 10వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ గెలిచి జకోవిచ్ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచి రఫెల్ నాదల్ రికార్డును చెరిపేసాడు.

24 మేజర్ సింగిల్స్ టైటిల్స్‌తో నొవాక్ జకోవిచ్ ఆల్-టైమ్ రికార్డు

వీటితో పాటు ఈ ఏడాది US ఓపెన్ టైటిల్ కూడా గెలుపొందాడు. ప్రపంచ పురుషుల టెన్నిస్‌లో అత్యధికంగా 24 మేజర్ సింగిల్స్ టైటిల్స్‌తో నొవాక్ జకోవిచ్ ఆల్-టైమ్ రికార్డును కలిగి ఉన్నాడు.

సెర్బియా దేశానికి చెందిన నోవాక్ జకోవిచ్ 1987, మే 22 న సెర్బియా లోని బెల్ గ్రేడ్ లో జన్మించాడు. 400 వారాల పాటు ప్రపంచ నెంబర్ వన్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు. టెన్నిస్ లో ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా జొకోవిచ్ కొనసాగుతున్నాడు.

ఇతడు ఇప్పటి వరకు 24 గ్రాండ్‌స్లాం టెన్నిస్ టైటిళ్ళను కైవసం చేసుకొన్నాడు. అందులో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టైటిళ్ళను 10 సార్లు, వింబుల్డన్ టెన్నిస్ టైటిళ్ళను 7 సార్లు, అమెరికన్ ఓపెన్ టెన్నిస్ టైటిళ్ళను 4, ఫ్రెంచ్ ఓపెన్ 3 సార్లు సాధించాడు.