Home   »  క్రీడలు   »   ODI Series |చివరి వన్డేలో ఆస్ట్రేలియా విజయం…2-1 తేడాతో సిరీస్ భారత్ కైవసం

ODI Series |చివరి వన్డేలో ఆస్ట్రేలియా విజయం…2-1 తేడాతో సిరీస్ భారత్ కైవసం

schedule mahesh

NEWDELHI: నిన్న రాజ్‌కోట్‌లో జరిగిన భారత్‌, ఆస్ట్రేలియా (ODI Series) మూడవ వన్డేలో భారత్ ఫై ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు

ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా టాపార్డర్‌లో భాగంగా డేవిడ్ వార్నర్ (56), మిచెల్ మార్ష్ (96), స్టీవ్ స్మిత్ (74), మార్నస్ లాబుషేన్ (72) అర్థశతకాలతో రాణించడం వల్ల ఆసీస్ జట్టు భారీ స్కోరు చేయగలిగింది.

భారత బౌలింగ్ విషయానికొస్తే జస్‌ప్రీత్ బుమ్రా 3 వికెట్లతో సత్తా చాటాడు. కానీ తన 10 ఓవర్ల కోటాలో 81 పరుగులు సమర్పించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో వికెట్ తీసుకున్నారు.

రోహిత్, కోహ్లీ మినహాయించి చేతులెత్తేసిన భారత బ్యాట్సమెన్

353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీంఇండియా 49.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ 57 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకి మంచి ఆరంభాన్నే అందించాడు. మరొక స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (56) కూడా అర్థశతకం తో రాణించాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 48 పరుగులతో పర్వాలేదు అనిపించాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు మినహాయించి జట్టులో మరెవ్వరూ రాణించకపోవడం వల్ల భారత్ జట్టు ఓటమిపాలైంది.

ఆస్ట్రేలియా బౌలర్లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఏకంగా 4 వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించాడు. హాజిల్‌వుడ్ రెండు వికెట్లు తీయగా మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ గ్రీన్, తన్వీర్ సంఘా తలా వికెట్ తీశారు.

3మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం (ODI Series)

రాబోయే వారం రోజులలో ప్రారంభం కానున్న ICC ప్రపంచ కప్ కు ముందు భారత్, ఆస్ట్రేలియా 3మ్యాచ్‌ల (ODI Series) సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో చేజిక్కించుకుంది.

ఆస్ట్రేలియా జట్టులో గాయం నుండి కోలుకుని తిరిగి జట్టులో చేరిన గ్లెన్ మాక్స్‌వెల్ భారత జట్టును కోలుకోలేని దెబ్బ తీసాడు. మ్యాక్స్‌వెల్ 10 ఓవర్లలో 40 పరుగులిచ్చి 4 వికెట్లు పడకొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ను అందుకున్నాడు.