Home   »  క్రీడలు   »   సన్‌రైజర్స్‌ కొత్త సారథిగా ప్యాట్ కమిన్స్ నియామకం..!

సన్‌రైజర్స్‌ కొత్త సారథిగా ప్యాట్ కమిన్స్ నియామకం..!

schedule mahesh

Pat Cummins | సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్‌కు ముందు ప్యాట్ కమిన్స్‌ను కెప్టెన్‌గా నియమించినట్లు ఫ్రాంచైజీ సోమవారం తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలిపింది.

Pat Cummins appointed as new SRH captain..!

Pat Cummins | మునుపటి రెండు సీజన్లలో SRHకి ఐడెన్ మార్క్రామ్ నాయకత్వం వహించాడు. కానీ మార్క్రామ్ నాయకత్వంలో SRH గణనీయమైన ఫలితాలను సాధించలేదు. అంతేకాకూండా ముఖ్యంగా IPL 2023 సీజన్ లో SRH ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో దిగువ స్థానంలో నిలిచింది.

2023లో ఆసీస్ జట్టుకు ప్రపంచకప్ అందించిన Pat Cummins

కానీ ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ మాత్రం 2023లో ఆసీస్ జట్టుకు ప్రపంచకప్ ను అందించాడు. అంతే కాకూండా ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను అందించాడు, ఇంగ్లాండ్‌లో యాషెస్‌ను నిలబెట్టుకోవడం ఈ ట్రోఫీలు అతని నాయకత్వ అర్హతలను పెంచాయి.

SRH కెప్టెన్‌గా వ్యవహిరించనున్న రెండో ఆస్ట్రేలియా ఆటగాడిగా Pat Cummins

కమిన్స్ IPL2024లో SRH జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, ఆస్ట్రేలియాకు అసిస్టెంట్ కోచ్‌గా పని చేస్తున్న డేనియల్ వెట్టోరి SRH కోచ్ గా పని చేస్తున్నాడు. వీరిద్దరి కలయికలో ఈ సారి SRH ట్రోఫీని సాధిస్తుందో.. లేదో.. చూడాలి. అంతేకాకుండా డేవిడ్ వార్నర్ తర్వాత SRH కెప్టెన్‌గా వ్యవహిరించబోతున్న రెండవ ఆస్ట్రేలియన్ ఆటగాడిగా ప్యాట్ కమ్మిన్స్ నిలవనున్నాడు.

కమిన్స్‌ను రూ.20.5 కోట్లకు కొనుగోలుచేసిన SRH

దుబాయ్‌లో జరిగిన IPL వేలంలో, SRH ఫ్రాంచైజీ కమిన్స్‌ను రూ.20.5 కోట్ల భారీ ధరకు తీసుకుంది. లీగ్ చరిత్రలో రెండవ అత్యంత ఖరీదైన ఆటగాడిగా కమిన్స్‌ నిలిచాడు. కమిన్స్ గతంలో IPLలో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్‌ తరపున ఆడాడు.

Also Read | ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-10 విజేతగా నిలిచిన పుణేరి పల్టాన్