Home   »  క్రీడలు   »   ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-10 విజేతగా నిలిచిన పుణేరి పల్టాన్

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-10 విజేతగా నిలిచిన పుణేరి పల్టాన్

schedule mahesh
PKL Season-10 Winner Puneri Paltan

PKL Season-10 Winner Puneri Paltan | మూడు నెలలుగా కబడ్డీ ప్రేమికులను ఉర్రూతలూగించిన ప్రొ కబడ్డీ లీగ్ (PKL) సీజన్-10 ఘనంగా ముగిసింది. ఈ సారి PKL సీజన్-10 లీగ్‌లో కొత్త ఛాంపియన్‌ అవతరించింది. హోరాహోరీగా సాగిన టైటిల్ పోరులో హర్యానా స్టీలర్స్‌ను ఓడించి పుణేరి పల్టాన్ టైటిల్ గెలుచుకుంది. శుక్రవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో పుణేరి పల్టాన్ 28-25 పరుగుల తేడాతో హర్యానా స్టీలర్స్‌ను ఓడించింది.

9 రైడ్ పాయింట్లతో సత్తా చాటిన పంకజ్ మోహిత్

పుణేరి పల్టాన్ తరపున పంకజ్ మోహిత్ 9 రైడ్ పాయింట్లు సాధించాడు. మోహిత్ గోయత్ (5 పాయింట్లు), అస్లమ్‌ ఇమాన్‌దార్‌ (4 పాయింట్లు), డిఫెండర్ గౌరవ్ ఖత్రి (4 పాయింట్లు)తో రాణించారు. మరోవైపు హర్యానా స్టీలర్స్ తరఫున శివ (6), సిద్ధార్థ్ దేశాయ్ (4), వినయ్ (3) పాయింట్లతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఫైనల్ పోరులో రైడింగ్‌లో ఇరు జట్లు సమంగా నిలిచినా, డిఫెన్స్‌లో పటిష్టమైన పుణేరి పల్టాన్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. రైడింగ్‌లో ఇరు జట్లు 17 పాయింట్లు సాధించగా, పుణేరి పల్టాన్ డిఫెన్స్‌లో 9 పాయింట్లతో సహా ఒక ఆల్ అవుట్ బోనస్ దక్కించుకుంది. హర్యానా 5 ట్యాకిల్స్‌కే పరిమితమై టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.

PKL Season-10 Winner Puneri Paltan

వరుసగా రెండో ఏడాది ప్రొ కబడ్డీ లీగ్‌లో ఫైనల్‌కు చేరిన పుణేరి పల్టాన్ టైటిల్ కలను నెరవేర్చుకొంది. గ్రూప్ దశలో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించిన పుణేరి పల్టాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, హర్యానా కూడా నిలకడ విజయాలతో ఫైనల్ కు చేరుకుంది. డిఫెన్స్ లో బలమైన జట్లుగా పేరొందిన ఈ రెండు జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఆచితూచి ఆడటంతో డూ ఆర్ డై రైడ్ లో మినహా మిగతా రైడ్‌లలో పెద్దగా పాయింట్లు నమోదు కాలేదు.

Also Read | క్రికెటర్లకు BCCI బంపరాఫర్‌…